తెలంగాణ

telangana

ETV Bharat / business

మంచి స్కూటర్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-10 మోడల్స్ ఇవే!

Best Scooters Under 1 Lakh In Telugu : నూతన సంవత్సరంలో కొత్త స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్ ఒక లక్ష రూపాయలు మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఒక లక్ష బడ్జెట్లో ఉన్న టాప్​-10 స్కూటర్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

TOP 10 Scooters Under 1 Lakh
Best Scooters Under 1 Lakh

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 4:31 PM IST

Best Scooters Under 1 Lakh : నేటి కాలంలో స్త్రీ, పురుషులు అందరూ స్కూటర్లు వాడడానికి బాగా ఇష్టపడుతున్నారు. లైట్ వెయిట్​తో, స్త్రీ, పురుషులు అందరూ ఉపయోగించడానికి వీలుగా ఉండడమే ఇందుకు కారణం. పైగా ఇరుకు సందుల్లో కూడా వీటితో సులువుగా వెళ్లిపోవచ్చు. అందుకే వీటికి ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ స్కూటర్ తయారీ సంస్థలు అన్నీ, మంచి లుక్స్​తో, తక్కువ బడ్జెట్లో, ఎక్కువ మైలేజ్​ ఇచ్చే బైక్​లను తయారు చేసి, మార్కెట్లోకి తెస్తున్నాయి. అందుకే ఈ ఆర్టికల్​లో​ మనం రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-10 స్కూటర్స్ గురించి తెలుసుకుందాం.

1. Honda Activa 6G Features : ఈ హోండా యాక్టివా 6జీ స్కూటర్​లో 109 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 8000 rpm వద్ద 7.84 PS పవర్​, 5500 rpm వద్ద 8.90 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్​ లీటర్​కు 50 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్​ 5 వేరియంట్స్​లో, 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Honda Activa 6G Price :మార్కెట్లో ఈ హోండా యాక్టివా 6జీ స్కూటర్ ధర రూ.80,334 నుంచి రూ.86,834 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

2. Suzuki Access 125 Features : ఈ సుజుకి యాక్సెస్​ 125 స్కూటర్​లో 124 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 6750 rpm వద్ద 8.7 PS పవర్​, 5500 rpm వద్ద 10 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్​ లీటర్​కు 45 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్​ 4 వేరియంట్స్​లో, 15 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Suzuki Access 125 Price : మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్​ 125 స్కూటర్ ధర సుమారుగా రూ.84,975 నుంచి రూ.94,876 వరకు ఉంటుంది.

3. TVS NTORQ 125 Features : ఈ టీవీఎస్​​ NTORQ 125 స్కూటర్​లో 124 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 7000 rpm వద్ద 9.38 PS పవర్​, 5500 rpm వద్ద 10.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్​ లీటర్​కు 53.4 కి.మీ - 56.23 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్​ 6 వేరియంట్స్​లో, 12 అందమైన రంగుల్లో దొరుకుతుంది.

TVS NTORQ 125 Price : మార్కెట్లో ఈ టీవీఎస్​ NTORQ 125 స్కూటర్ ధర రూ.88,333 నుంచి రూ.1.08 లక్షల వరకు ఉంటుంది.

4. TVS Jupiter Features : ఈ టీవీఎస్​​ జూపిటర్​ స్కూటర్​లో 109 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 7500 rpm వద్ద 7.88 PS పవర్​, 5500 rpm వద్ద 8.8 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్​ 50 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్​ 6 వేరియంట్స్​లో, 16 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది.

TVS Jupiter Price : మార్కెట్లో ఈ టీవీఎస్​ జూపిటర్​ స్కూటర్ ధర రూ.79,051 నుంచి రూ.93.927 లక్షల ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

5. Honda Dio Features : ఈ హోండా డియో స్కూటర్​లో 109 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 8000 rpm వద్ద 7.85 PS పవర్​, 5250 rpm వద్ద 9.3 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్​ 50 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్​ 3 వేరియంట్స్​లో, 5 కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది.

Honda Dio Price : మార్కెట్లో ఈ హోండా డియో స్కూటర్​ ప్రైస్​​ రూ.76,824 నుంచి రూ.84,325 వరకు ఉంటుంది.

6. Honda Activa 125 Features : ఈ హోండా యాక్టివా 125 స్కూటర్​లో 124 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 6250 rpm వద్ద 8.30 PS పవర్​, 5000 rpm వద్ద 10.4 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్​ లీటర్​కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్​ 4 వేరియంట్స్​లో, 5 కలర్ ఆప్షన్స్​లో లభిస్తుంది.

Honda Activa 125 Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 125 స్కూటర్ ధర సుమారుగా రూ.84,717 నుంచి రూ.93,890 వరకు ఉంటుంది.

7. Yamaha RayZR 125 Fi Hybrid Features : ఈ యమహా RayZR 125 స్కూటర్​లో 125 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 6250 rpm వద్ద 8.2 PS పవర్​, 5000 rpm వద్ద 10.3 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్​ లీటర్​కు 71.33 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్​ 5 వేరియంట్స్​లో, 12 అందమైన రంగుల్లో అందుబాటులో ఉంది.

Yamaha RayZR 125 Fi Hybrid Price : మార్కెట్లో ఈ యమహా RayZR 125 ధర సుమారుగా రూ.87,295 నుంచి రూ.96,964 ప్రైస్​ రేంజ్​లో ఉంది.

8. Ola S1 X Features : ఈ ఓలా ఎస్​1 ఎక్స్​ స్కూటర్​ను ఫుల్​ ఛార్జ్ చేస్తే 151 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. దీనిని ఫుల్​ రీఛార్జ్​ చేయడానికి 7.4 గంటలు పడుతుంది. అయితే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్కూటర్​తో గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. ఇది 3 వేరియంట్లలో, 7 రంగుల్లో లభిస్తుంది.

Ola S1 X Price :మార్కెట్లో ఈ ఓలా ఎస్​ 1 ఎక్స్​ స్కూటర్ ధర సుమారుగా రూ.89,999 నుంచి రూ.99,999 వరకు ఉంటుంది.

9. Hero Pleasure Plus Features : ఈ హీరో ప్లెజర్ ప్లస్​ స్కూటర్​లో 110 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 7000 rpm వద్ద 8.1 PS పవర్​, 5500 rpm వద్ద 8.70 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్​ లీటర్​కు 50 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్​ 5 వేరియంట్స్​లో, 8 అందమైన రంగుల్లో లభిస్తోంది.

Hero Pleasure Plus Price : మార్కెట్లో ఈ హీరో ప్లెజర్ ప్లస్ స్కూటర్ ధర రూ.75,428 నుంచి రూ.86,958 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

10. Kinetic Green Zing Features :ఈ కైనెటిక్ గ్రీన్​ జింగ్​ స్కూటర్​ను ఫుల్​ ఛార్జ్ చేస్తే 100 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. దీనిని ఫుల్​ రీఛార్జ్​ చేయడానికి 4 గంటలు పడుతుంది. ఈ స్కూటర్​తో గంటకు 45 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. ఇది 3 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Kinetic Green Zing Price : మార్కెట్లో ఈ కైనటిక్ గ్రీన్ జింగ్ స్కూటర్ ధర రూ.71,500 నుంచి రూ.84,990 ప్రైస్ రేంజ్​లో ఉంటుంది.

ఎలక్ట్రిక్​ వాహనాలపై మహిళలకు సబ్సిడీ! ఎంతంటే?

కొత్త ఏడాదిలో కార్లపై భారీ డిస్కౌంట్స్ - ఏ మోడల్​పై ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details