Post Office Saving Schemes for Boys :ఏ తల్లిదండ్రులైనా.. పిల్లలు తమలా ఇబ్బందులు పడకూడదని కోరుకుంటారు. ఇందుకోసం.. వారికి మంచి చదువులు చెప్పించడం మొదలు.. ఆర్థికంగా కూడా అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. అవకాశం ఉన్నవారు ఆస్తులు ఇస్తే.. లేని వారు కనీసం కొంత డబ్బును సేవ్ చేసేందుకైనా చూస్తారు. ఈ క్రమంలో చాలా మంది.. తమకు పిల్లలు పుట్టినప్పుటి నుంచే ఏదైనాపొదపు పథకం(Savings Scheme)లో చేరాలని భావిస్తుంటారు.
Boy Child Best Post Office Schemes :మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి మంచి పెట్టుబడి స్కీమ్‌ల కోసం చూస్తున్నట్లయితేకేంద్ర ప్రభుత్వం(Central Government) వివిధ పోస్టాఫీస్ సేవింగ్స్ పథకాలను రూపొందించింది. ఇప్పటికే.. ఆడపిల్లల కోసం అనేక పథకాలు అమలులో ఉండగా.. మగ పిల్లల కోసం పలు పథకాలు ప్రవేశపెట్టింది. ఇంతకీ ఆ పథకాలు ఏంటి? ఎన్ని సంవత్సరాల వారు అర్హులు? ఈ పథకాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అన్న వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
దేశంలో మగ పిల్లల కోసం అమలులో ఉన్న 5 ఫోస్ట్ ఆఫీస్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. కిసాన్ వికాస్ పత్ర పథకం (Kisan Vikas Patra Scheme for Child Boy) :ఇండియా పోస్ట్ ద్వారా 1988లో ప్రవేశపెట్టిన కిసాన్ వికాస్ పత్ర అనే స్కీమ్(Kisan Vikas Patra Scheme)దేశంలో తక్కువ ఆదాయంతో పాటు మధ్యతరగతి ఆదాయ కుటుంబాలకు సరిపోయే సముచితమైన ప్రణాళిక. ఇది దేశంలోని మగ పిల్లల కోసం ఒక స్వల్ఫకాలిక పోస్టాఫీసు పొదుపు పథకం. తల్లిదండ్రులను సంవత్సరానికి ఒక నిర్ధిష్ట మొత్తం డబ్బుపై పెట్టుబడి పెట్టడానికి ఈ స్కీమ్ అనుమతిస్తుంది.
కిసాన్ వికాస్ పత్ర (KVP) ప్లాన్ వివరాలు :
Kisan Vikas Patra Scheme Features :
- 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా ఈ పథకానికి అర్హులు.
- ఒకవేళ 18 ఏళ్లు నిండని వారి తరఫున వారి కుటుంబ సభ్యులు ఈ పాలసీకి అప్లై చేసుకోవచ్చు.
- కనీస పెట్టుబడి మొత్తం- రూ.1000, గరిష్ఠంగా పెట్టుబడి మొత్తం- No Upper Limit.
- జూన్ 2023 నాటికి ఈ పథకంలో సంవత్సరానికి వడ్డీ రేటు-7.9%.
- అత్యవసర పరిస్థితుల్లో మీరు ఈ స్కీమ్‌లో పెట్టిన నిధులను ముందుగానే ఉపసంహరించుకోవచ్చు.
- కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ అనేది ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు.
- మెచ్యురిటీ పీరియడ్-10 సంవత్సరాల 4 నెలలు. ఈ స్కీమ్ ద్వారా తక్కువ వడ్డీరేటుకు తల్లిదండ్రులు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంది.
2. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ :
National Savings Certificate :నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) అనేది తక్కువ రిస్క్, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉన్న పథకం. దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌లలో అందుబాటులో ఉన్న ప్రభుత్వం ఆధారిత పథకం. పన్ను ప్రయోజనాలతోపాటు పొదుపు చేసేలా చిన్న, మధ్య ఆదాయ పెట్టుబడి దారులను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. వ్యక్తిగతంగా, ఉమ్మడిగా లేదా మైనర్ కోసం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కోసం పోస్టాఫీస్‌లో అప్లై చేసుకోవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ప్రయోజనాలు :
National Savings Certificate Benefits :
- 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం.. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దీనికి అప్లై చేసుకోవచ్చు.
- ఈ పథకం కనిష్ఠ పెట్టుబడి-రూ.1000. గరిష్ఠ పెట్టుబడిపై పరిమితి లేదు.
- ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీరేటు సంవత్సరానికి 7.7% గా ఉంది.
- ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ స్కీమ్‌లో వడ్డీ రేట్లను సవరిస్తోంది.
- ఎన్ఎస్సీ మెచ్యురిటీ కాలం- 5 సంవత్సరాలు. లాక్ ఇన్ టెన్యూర్-5 సంవత్సరాలు.
- ఈ పథకం ద్వారా ₹1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.
Best Post Office Schemes With High Savings: పొదుపు కోసం ఏ పోస్టాఫీస్ పథకం మంచిది.. మీకు తెలుసా?