Best Insurance Policy : అధిక వడ్డీ రేట్లు, ఫ్లెక్సిబిలిటీ కారణంగా చాలా మంది సింగిల్ ప్రీమియం లైఫ్ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇష్టపడతారు. రెగ్యులర్ ఇన్కమ్ లేనివారికి ఈ వన్ టైమ్ పేమెంట్ ఆప్షన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సింగిల్ ప్రీమియం పాలసీలకు ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా స్థిర చెల్లింపులు ఉంటాయి. ఇవి పాలసీదారులకు వారి పొటెన్షియల్ గ్రోత్ పెరగడం, కవరేజీ, లాక్ చేయడం ద్వారా ఆర్థిక భద్రతను కల్పిస్తాయి.
తక్షణ కవరేజీ, అధిక నగదు, మరణించిన తర్వాత వచ్చే ప్రయోజనాల వల్ల ప్రీమియం పాలసీల అమ్మకాలు పెరిగాయి. విపరీతంగా అవగాహన కల్పించడం, వీటికి అనుబంధంగా ఉన్న ప్రయోజనాలూ పాలసీలు పెరగడానికి మరో కారణం. గతేడాది డిసెంబరులో 55 శాతంగా ఉన్న వీటి ప్రీమియం విలువ.. ఈ సంవత్సరం 70 శాతానికి చేరింది. అటు ప్రైవేటు బీమా సంస్థల వాటా 43 నుంచి 53 శాతానికి (10 శాతం), ఎల్ఐసీలో 70 నుంచి 82 శాతానికి పెరిగింది.
అనేక మంది నిపుణుల ప్రకారం.. పాలసీదారులు సింగిల్ ప్రీమియంపాలసీని కొనుగోలు చేయడం ఉత్తమం. ఒక్కసారి పాలసీ కొనుగోలు చేసిన తర్వాత.. వారు ఆ కవరేజీ మొత్తాన్ని లేదా పెట్టుబడి ఎంపికల్ని మార్చలేరని గుర్తుంచుకోవాలి. వ్యక్తులు సింగిల్ ప్రీమియం యూనిట్ - లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (యూలిప్స్) కొనవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మార్కెట్ లింక్డ్ పెట్టుబడి ఉత్పత్తులు. స్వల్ప కాలంలో మార్కెట్ అస్థిరత.. ఫండ్ నికర ఆస్తి విలువను ప్రభావితం చేస్తాయి. కాబట్టి నగదు విస్తరించడం వల్ల పాలసీదారుల్ని విపత్కర మార్కెట్ పరిస్థితుల నుంచి రక్షించవచ్చు. పైగా రెగ్యులర్ ప్రీమియం యులిప్స్ కంటే సింగిల్ ప్రీమియం యులిప్స్ అధిక ఫీజులుంటాయి. ఫలితంగా పెట్టుబడి రాబడి తగ్గే అవకాశముంది.
రెగ్యులర్ ప్రీమియం పాలసీలో లాక్ ఇన్ పీరియడ్ పూర్తయ్యేలోపు.. అవసరమైతే పెట్టుబడి పెట్టిన నిధుల్ని యాక్సెస్ చేసే సౌకర్యముంది. వీటి ప్లాన్లు ఖర్చు సగటును, మార్కెట్లో హెచ్చు తగ్గుల ప్రయోజనాన్ని పొందేందుకు పాలసీదారుల్ని అనుమతిస్తాయి. నిర్ణీత వ్యవధిలో నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెడితే.. మార్కెట్లు పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లు, పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొనుగోలు చేయడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చు. దీని వల్ల సింగిల్ ప్రీమియంలో పెట్టుబడితో పోలిస్తే దీర్ఘకాలిక రాబడులు వస్తాయి.
సిప్‌లో భాగంగా యులిప్స్ కొనుగోలు చేస్తే మంచి రాబడి వస్తుంది. కాబట్టి తక్కువ ఖర్చు, రిస్క్‌తో కూడిన పెట్టుబడి పెట్టాలనుకుంటే రెగ్యులర్ ప్రీమియం యులిప్ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. అదే మీ దగ్గర అధిక మొత్తంలో డబ్బు ఉండి, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే.. సింగిల్ ప్రీమియం యులిప్ ఎంచుకోవచ్చు. సింగిల్ ప్రీమియం పాలసీ కొనుగోలు చేసే ముందు.. ఆ పాలసీ ద్వారా వచ్చే ప్రయోజనాలు గురించి తెలుసుకోవాలి. అంటే మెచ్యూరిటీ, డెత్ బెనిఫిట్లతో పాటు అదనపు రైడర్లు, కవరేజీ, విభిన్న ఛార్జీలు, ప్రీమియం కేటాయింపులు తదితర వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.