Best Child Savings Investment Plan :నేటి టెక్నాలజీ యుగంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా పిల్లల చదువుల ఖర్చులయితే.. తారస్థాయికి చేరుకున్నాయి. డాక్టర్, ఇంజినీరింగ్ చదువులకు వచ్చే సమయానికి.. అస్తులు అమ్మి చదివించాల్సిన పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో ఇవి ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే.. ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలనుకుంటే.. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే.. ఏదైనా సేవింగ్ స్కీమ్(Saving Scheme)లో చిన్నమొత్తాల్లో పెట్టుబడి పెడితే.. వారి అవసరాలకు మంచి రాబడి అందుతుందని చెబుతున్నారు నిపుణులు.
Systematic Investment Plan is Best Saving Scheme :అయితే చాలామంది ఏ స్కీమ్‌లో చేరితే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చూస్తారు. అలాంటి వారికి మ్యూచువల్ ఫండ్స్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఒక మంచి ఆప్షన్ అని నిపుణులు సూచిస్తున్నారు. దీంట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ పిల్లల ఉన్నత చదువులకే కాదు వారి పెళ్లికి అవసరమయ్యే డబ్బును సమకూర్చుకోవచ్చు. సిప్‌లో రోజుకు 167 రూపాయలు.. అంటే నెలకు రూ.5 వేల పెట్టుబడి పెడితే.. పిల్లలకు 20 ఏళ్లు వచ్చేసరికి రూ. 50 లక్షలు సమీకరించుకోవచ్చని సూచిస్తున్నారు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Sip is Best Option for Saving Investments :ఈ మధ్య కాలంలో ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) పెట్టుబడి విధానం చాలా ప్రాచుర్యం పొందింది. దీని ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్లలో డబ్బుల్ని పెట్టుబడిగా పెడతారు. అయితే.. ఇది స్టాక్ మార్కెట్‌తో ముడిపడి ఉన్నందున స్థిర వడ్డీ రేటు రాబడికి హామీ ఇవ్వబడదు. నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం కంటే సిప్(SIP) రూపంలో పెట్టే పెట్టుబడులతోనే ఆకర్షిణీయ స్థాయిలో లాభాలు పొందొచ్చు. అలాగే ఇందులో రిస్క్ కాస్త తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇది దీర్ఘకాలంలో మంచి రాబడిని, సంపదను నిర్మిస్తుందని నిపుణులు చెబుతుంటారు. దీనికి చక్రవడ్డీ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ విధానంలో సగటున 12 శాతం నుంచి ఎక్కువ రాబడిని కూడా ఆశించవచ్చని అంటున్నారు.
Gram Suraksha Postal Scheme Details : రోజుకు 50 రూపాయలు పొదుపు.. రూ.35 లక్షలు మీ సొంతం..!