Banks 2 Weekly Off Proposal : భారతీయ బ్యాంకులు త్వరలో వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయా? శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవులా? ఈ ప్రశ్నకు.. చాలా వరకు అవును అనే సమాధానమే వస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఇటీవలే.. బ్యాంకులు వారంలో 5 రోజులు పనిచేసేందుకు; శని, ఆదివారాలు సెలవు దినాలుగా ఉండేందుకు చేసిన ప్రతిపాదనను ఆమోదించింది. మరి దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలుపుతుందా? లేదా? అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.
5 రోజులే పనిచేయనున్న బ్యాంకులు!
Bank Working Days In Week : ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ఆమోదించిన ప్రతిపాదనలు ఒకవేళ అమలు అయితే.. అప్పుడు బ్యాంకులు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తాయి. అయితే ఉద్యోగులు మాత్రం ప్రతిరోజూ ఓ 45 నిమిషాలపాటు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది.
ఫైనాన్స్ మినిస్ట్రీ ఓకే అంటుందా?
Bank 2 Days Weekly Off Proposal : బ్యాంకులకు రెండు రోజుల సెలవు ప్రతిపాదన.. ప్రస్తుతం కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వద్ద ఉంది. ఈ ప్రతిపాదనకు ఫైనాన్స్ మినిస్ట్రీ ఆమోదం తెలిపిన తరువాత.. తదుపరి పరిశీలన కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ ప్రతిపాదనను సమర్పించడం జరుగుతుంది.