Overall Apple Subscribers Count : అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ యాపిల్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా తాము అందిస్తున్న అన్ని సేవలకు కలిపి 100 కోట్ల(1 బిలియన్)కు పైగా పెయిడ్ సబ్స్క్రిప్షన్లను సాధించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. గత 12 నెలల్లో ఏకంగా 15 కోట్ల (150 మిలియన్) మంది కొత్త సబ్స్క్రైబర్లు ఈ జాబితాలో చేరారని తెలిపింది. కేవలం మూడు సంవత్సరాల్లోనే తమ సబ్స్క్రైబర్ల సంఖ్య రెట్టింపు అయిందని యాపిల్ చెప్పింది. కాగా, 2020లో ఈ సంఖ్య 500 కోట్లుగా ఉంది.
Apple Company Overall Subscribers : ప్రపంచవ్యాప్తంగా యాపిల్ యాక్టివ్ యూజర్స్ అత్యంత వేగంగా పెరుగుతన్నారని.. ఇది భవిష్యత్‌లో తమ సంస్థ తయారు చేసే ఎకోసిస్టమ్ ప్రోడక్ట్ మరింత విస్తరించేందుకు దోహదపడుతుందని ఐఫోన్ కంపెనీ తెలిపింది. కాగా, ప్రస్తుతానికి యాపిల్‌కు 2 బిలియన్(200 కోట్లు)కుపైగా యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. అయితే 1 బిలియన్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్‌తో తమ కంపెనీ ఆల్-టైమ్-హై రికార్డు ఆదాయాన్ని ఆర్జించిందని.. ఇది తాము అందించిన మెరుగైన సేవలతోనే సాధ్యమైందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ అన్నారు.
"మా సేవల కారణంగా పెరిగిన పెయిడ్ సబ్‌స్క్రిప్షన్స్‌ను మేము చూస్తున్నాము. మా లావాదేవీలు, చెల్లింపులు రెండూ కూడా ప్రతి ఏడు మెరుగైన వృద్ధిని నమోదు చేస్తూ వస్తున్నాయి. ప్రతిదీ ఆల్-టైమ్-హైగా నిలుస్తున్నాయి. ఈ మా పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ సంస్థ బలమైన వృద్ధిని తెలియజేస్తున్నాయి."