తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 1:24 PM IST

ETV Bharat / business

Amazon Prime Shopping Edition Plan : ఫ్లిప్​కార్ట్ VIP ప్లాన్​కు పోటీగా.. అమెజాన్​ 'ప్రైమ్ షాపింగ్ ఎడిషన్​' ప్లాన్​.. స్పెషల్​ బెనిఫిట్స్ ఏమిటంటే?

Amazon Prime Shopping Edition Plan Details In Telugu : ఆన్​లైన్ షాపింగ్ ప్రియులకు గుడ్​ న్యూస్​. అమెజాన్​ 'ప్రైమ్​ షాపింగ్ ఎడిషన్'​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఫ్రీ షిప్పింగ్​, వన్​డే డెలివరీ సహా అనేక బెనిఫిట్స్ లభిస్తాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Amazon Prime Shopping Edition subscription plan
Amazon Prime Shopping Edition Plan

Amazon Prime Shopping Edition Plan : అమెజాన్ గ్రేట్​ ఇండియన్ ఫెస్టివల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం కానుండగా, ప్రైమ్ యూజర్లకు ఒక్క రోజు ముందుగానే అంటే అక్టోబర్​ 7 నుంచే ఈ మెగా సేల్ అందుబాటులోకి వచ్చింది. అయితే అమెజాన్​ ఈ పండుగ సీజన్​ను మరింతగా క్యాష్ చేసుకునేందుకు తాజాగా 'ప్రైమ్​ షాపింగ్ ఎడిషన్'​ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​ను ఉందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా తమ యూజర్లకు అనేక బెస్ట్ బెనిఫిట్స్ కల్పించనుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్లిప్​కార్ట్ Vs అమెజాన్​
Flipkart Vs Amazon Shopping Subscription : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ ఇటీవలే వీఐపీ సబ్​స్క్రిప్షన్ ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని సంవత్సర చందా​ రూ.499 మాత్రమే. దీని ద్వారా ఫ్లిప్​కార్ట్ యూజర్లకు అనేక ఆఫర్స్, డిస్కౌంట్స్​, హోమ్ డెలివరీ ఫెసిలిటీస్ అందిస్తోంది. దీనికి పోటీగా అమెజాన్​ఇప్పుడు 'ప్రైమ్​ షాపింగ్ ఎడిషన్​ సబ్​స్క్రిప్షన్​' ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చింది. పైగా దీని సంవత్సర చందాను కేవలం రూ.399గా నిర్ణయించింది. అయితే దీనిన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మాత్రమే ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఆండ్రాయిడ్ ఫోన్లలోని.. అమెజాన్ యాప్​, అమెజాన్ మొబైల్ బ్రౌజర్లలో ఈ సరికొత్త అమెజాన్ 'ప్రైమ్ షాపింగ్​ ఎడిషన్' సబ్​స్క్రిప్షన్​ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

బెస్ట్ బెనిఫిట్స్​!
Amazon Prime Shopping Subscription Plan Benefits : అమెజాన్​ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్​ సబ్​స్క్రిప్షన్ తీసుకున్నవారికి.. ప్రైమ్ యూజర్ల మాదిరిగానే అన్ని బెనిఫిట్స్​ లభిస్తాయి. ముఖ్యంగా ఫ్రీ షిప్పింగ్​, వన్​డే డెలివరీ సౌలభ్యం లభిస్తుంది. అయితే ప్రైమ్ వీడియో, మ్యూజిక్, రీడింగ్, గేమింగ్​ లాంటి ఎంటర్​టైన్మెంట్​ ఫీచర్స్ మాత్రం ఉండవు.

తెలివిగా ప్లాన్ చేసింది!
భారతదేశంలో 650 మిలియన్లకు పైగా స్మార్ట్​ఫోన్ యూజర్లు ఉన్నారు. అందులో 85 శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. అందుకే వీరిని టార్గెట్​ చేసుకుంది అమెజాన్​. అయితే అమెజాన్ తీసుకువచ్చిన ఈ 'ప్రైమ్​ షాపింగ్ ఎడిషన్' ప్లాన్​ అనేది సంవత్సరం అంతా పనిచేస్తుందా? లేదా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ లాంటి ప్రత్యేకమైన సేల్స్​ టైమ్​లోనే పనిచేస్తుందా? అనే విషయంలో ​ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అమెజాన్​ ఇప్పుడే కాదు గతేడాది కూడా.. పండుగ సేల్ టైమ్​లో.. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్​ను రూ.599లతో ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్ బేస్​ను గణనీయంగా పెంచుకుంది.

JIO Airtel World Cup Data Packs 2023 : క్రికెట్​ వరల్డ్ కప్​ మ్యాచ్​ల కోసం.. జియో, ఎయిర్​టెల్​ సూపర్​ డేటా ప్లాన్స్​!

Festival Offers In October 2023 : దసరా పండుగ సేల్స్​​.. ఫ్యాషన్​ & బ్యూటీ ప్రొడక్టులపై 90%.. స్మార్ట్​ఫోన్లపై 80% డిస్కౌంట్స్​!

ABOUT THE AUTHOR

...view details