తెలంగాణ

telangana

ETV Bharat / business

Amazon Prime Lite : తక్కువ ధరకే అమెజాన్​ ప్రైమ్​ లైట్.. కేవలం రూ.999తో సూపర్​ బెనిఫిట్స్​

Amazon Prime Lite : ఓటీటీ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​​. రూ.999కే అమెజాన్ ప్రైమ్​ లైట్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దాదాపు అమెజాన్​ రెగ్యులర్​ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​లో ఉన్న ప్రయోజనాలు ఇందులోనూ ఉన్నాయి. మరిన్ని వివరాలు మీ కోసం..

Amazon Prime Lite vs amazon prime
Amazon Prime Lite

By

Published : Jun 18, 2023, 3:30 PM IST

Amazon Prime Lite : అమెజాన్​ ప్రైమ్​ లైట్​ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చేసింది. ఓటీటీ ఫ్యాన్స్​ను ఆకట్టుకునేందుకు​ అమెజాన్​ కేవలం రూ.999కే ఈ ప్లాన్​ను తీసుకొచ్చింది. అమెజాన్​ ప్రైమ్​ రెగ్యులర్​ ప్లాన్​లో ఉన్న దాదాపు అన్ని ప్రయోజనాలు దీనిలోనూ ఉన్నాయి.

యూజర్​ బేస్​ పెంచుకోవడం కోసం..
అమెజాన్​ రెగ్యులర్ ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​ ఇప్పుడు రూ.1499గా ఉంది. ధర కాస్త ఎక్కువగా ఉండడం వల్ల చందాదారులు మళ్లీ రెన్యువల్​ చేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. మరో వైపు కొత్త వినియోగదారులు కూడా సబ్​స్క్రిప్షన్​ తీసుకోవడానికి పెద్దగా ముందుకు రావడం లేదు. అందువల్లనే అమెజాన్ తన యూజర్​ బేస్​ను పెంచుకునేందుకు అమెజాన్​ ప్రైమ్​ లైట్​ ప్లాన్​ను తీసుకొచ్చింది.

సింగిల్​ ప్లాన్​ మాత్రమే..
అమెజాన్​ ప్రైమ్ లైట్​ సబ్​స్క్రిప్షన్​ గడువు 12 నెలలు. ఈ ప్లాన్​ను ఒకేసారి రూ.999 చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్​ అమెజాన్​ ప్రైమ్​ ప్లాన్​లాగా దీనిలో నెలవారీ, త్రైమాసిక సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​ లేవు. మొదట్లో కొందరు యూజర్లకు మాత్రమే ప్రైమ్​ లైట్ ప్లాన్​ను అందించిన అమెజాన్​.. ఇప్పుడు అందరికీ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది.

అమెజాన్ ప్రైమ్​​ లైట్​ - ప్రయోజనాలు
Amazon Prime Lite Benefits : ప్రైమ్​ లైట్​ చందాదారులు.. ఒకేసారి రెండు డివైజ్​ల్లో హెచ్​డీ క్వాలిటీ ప్రైమ్​ వీడియోలను వీక్షించవచ్చు. దీనితో పాటు అమెజాన్ స్టాండర్డ్​ డెలివరీ ఆప్షన్​ జత చేయడం వల్ల​ రెండు రోజుల్లోనే డెలివరీ పొందే అవకాశం ఉంది. అలాగే ఎలిజిబిలిటీ ఉన్న చిరునామాకు రూ.175లు చెల్లించి మార్నింగ్​ డెలివరీ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్​ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం వరకు క్యాష్​బ్యాక్​, బిల్​ పేమెంట్స్​పై 2 శాతం వరకు క్యాష్​ బ్యాక్​ లభిస్తాయి. అమెజాన్​ లైటనింగ్​ డీల్స్​కు ఎర్లీ యాక్సెస్​తో పాటు 'డీల్స్​ ఆఫ్​ ద డే' కూడా ప్రైమ్ లైట్ యూజర్లు పాల్గొనవచ్చు.

ప్రైమ్​ Vs​ ప్రైమ్ లైట్​

Amazon Prime Lite vs Prime : ప్రైమ్​ రెగ్యులర్​ ప్లాన్​ చందాదారులతో పోలిస్తే.. ప్రైమ్​లైట్​ యూజర్లు కొన్ని ప్రయోజనాలను తక్కువగా పొందుతారు. రెగ్యులర్​ ప్లాన్​లో ఉన్న వన్​ డే డెలివరీ, సేమ్​ డే డెలివరీ సదుపాయాలు.. ప్రైమ్ లైట్​ వినియోగదారులకు ఉండవు. అలాగే ప్రైమ్ రీడింగ్​, ప్రైమ్ మ్యూజిక్​, ప్రైమ్ గేమింగ్​ కూడా ఉచితంగా దొరకవు. నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉండదు.

రెగ్యులర్​ ప్రైమ్​ యూజర్లు 4కే క్వాలిటీతో ఒకే సారి ఆరు డివైజ్​ల్లో వీడియోలను వీక్షించగలుగుతారు. కానీ ప్రైమ్​ లైట్ ప్లాన్​ యూజర్లు.. హెచ్​డీ క్వాలిటీ వీడియోలను కేవలం రెండు డివైజ్​ల్లో మాత్రమే ఒకేసారి చూడగలుగుతారు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రైమ్​ లైట్​లో ప్రకటనలు కూడా వస్తాయి. ఇది వీక్షకులను కచ్చితంగా చీకాకు పెట్టవచ్చు. ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే అమెజాన్​ ప్రైమ్​ లైట్​ను తీసుకోవచ్చు. అయితే రెగ్యులర్​ ప్రైమ్​ ప్లాన్​లాగా అన్ని బెనిఫిట్స్​ పొందాలంటే మాత్రం అమెజాన్ రెగ్యులర్​ ప్లాన్స్​లో రూ.299కే నెలవారీ సబ్​స్క్రిప్షన్​, రూ.599కు త్రైమాసిక సబ్​స్క్రిప్షన్​ తీసుకోండి.

ABOUT THE AUTHOR

...view details