తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 3:33 PM IST

ETV Bharat / business

అమెజాన్ యూజర్లకు గుడ్​ న్యూస్​ - డబ్బులు లేకున్నా షాపింగ్ చేసే అవకాశం - ఎలా అంటే?

Amazon Credit On UPI Feature In Telugu : అమెజాన్ యూజర్లకు గుడ్ న్యూస్​. అమెజాన్​ త్వరలో యూపీఐ 'క్రెడిట్​ లైన్' ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇదే జరిగితే బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకున్నా, కనీసం క్రెడిట్ కార్డు కూడా లేకున్నా అమెజాన్​లో షాపింగ్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

UPI Payments Without Bank Funds Or Rupay Cards
Amazon Credit On UPI Feature

Amazon Credit On UPI Feature :యూనిఫైడ్​ పేమెంట్ ఇంటర్​ఫేస్​ (UPI)​ అందుబాటులోకి వచ్చిన తరువాత డిజిటల్​ ఆర్థిక లావాదేవీలు చాలా సులువు అయిపోయాయి. సాధారణంగా ఈ డిజిటల్​ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మన బ్యాంక్​ అకౌంట్​ లేదా రూపే క్రెడిట్​ కార్డును యూపీఐతో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకున్నా, ఇప్పుడు యూపీఐ పేమెంట్స్ చేసుకోవడానికి వీలవుతుంది. యూపీఐకు క్రెడిట్ కార్డును కూడా అనుసంధానం చేయాల్సిన అవసరం ఉండదు. అది ఎలా అంటే?

అమెజాన్​ - క్రెడిట్ లైన్స్​
కొన్ని బ్యాంకులు యూపీఐ యూజర్లకు క్రెడిట్ లైన్స్​ను అందిస్తున్నాయి. దీని ద్వారా తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు లేకున్నా, యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతుంది. ఇదే విధానాన్ని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్​ కూడా త్వరలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అమెజాన్​ ఫైనాన్సియల్ సర్వీసెస్ డివిజన్ అయిన 'అమెజాన్ పే' 2024 ప్రథమార్థంలో 'క్రెడిట్ ఆన్ యూపీఐ' ఫీచర్​ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్​ చేస్తోంది. దీని వల్ల అమెజాన్ యూజర్లకు మంచి లబ్ధి చేకూరనుంది. అమెజాన్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది.

సింపుల్​గా షాపింగ్​
అమెజాన్​ క్రెడిట్​ ఆన్​ యూపీఐ ఫీచర్​ కనుక అందుబాటులోకి వస్తే, యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకున్నా, షాపింగ్ చేసుకోలగుతారు. రూపే క్రెడిట్ కార్డును యూపీఐతో అనుసంధానం చేయాల్సిన పని కూడా ఉండదు. అయితే, ఇలా తీసుకున్న క్రెడిట్​ను (రుణాన్ని) నిర్దిష్ట వ్యవధిలోపు తీర్చేయాల్సి ఉంటుంది.

క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అంటే ఏమిటి?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 'క్రెడిట్​ లైన్​ ఆన్​ యూపీఐ' సేవలను ప్రవేశపెట్టింది. సింపుల్​గా చెప్పాలంటే, మీ బ్యాంకు అకౌంట్​లో డబ్బులు లేనప్పుడు, మీకు ముందస్తుగా ఇచ్చే రుణమే ఈ క్రెడిట్ లైన్​. దీని ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయడం చాలా సులువు అవుతుంది

2016లో అలా మొదలైంది!
భారతదేశంలో 2016లో యూపీఐ పేమెంట్స్ మొదలయ్యాయి. యూపీఐ సిస్టమ్​తో సేవింగ్స్ అకౌంట్​/ ఓవర్​డ్రాఫ్ట్​ ఖాతా/ ప్రీపెయిడ్ వాలెట్లు/ రూపే క్రెడిట్ కార్డులను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాతనే యూపీఐ పేమెంట్స్ చేయడానికి వీలవుతుంది.

ఒకప్పుడు ఆన్​లైన్ పేమెంట్స్​ చేయడానికి బ్యాంక్ అకౌంట్​ నంబర్​, క్రెడిట్​/ డెబిట్ కార్డ్ నంబర్​, ఓటీపీ, సీవీవీ, ఎక్స్​పైరీ డేట్ లాంటివి అవసరం అయ్యేవి. కానీ నేడు ఫోన్​ నంబర్​, అకౌంట్​ నంబర్​, యూపీఐ ఐడీ, యూపీఐ క్యూఆర్​ కోడ్​లు ఉంటే చాలు, చాలా సులువుగా ఆర్థిక లావాదేవీలు జరపవచ్చు. పైగా ఈ యూపీఐ సర్వీస్​ 24x7 అందుబాటులో ఉంటుంది.

ఆపద సమయంలో సాయం అందించే - ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్ ఇవే!

ఆర్థిక లక్ష్యాల సాధన కోసం - బెస్ట్​ 'సొల్యూషన్​ ఓరియెంటెడ్'​ మ్యూచువల్ ఫండ్స్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details