NDTV Adani Group : ఎన్డీటీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ దంపతుల నుంచి 27.26 శాతం వాటా కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. పరస్పర బదిలీ పద్ధతిలో ప్రణయ్ రాయ్ దంపతుల నుంచి 27.26 శాతం వాటాను ఎన్డీటీవీ ప్రమోటర్, పరోక్ష అనుబంధ సంస్థ ఆర్ఆర్పీఆర్ కొనుగోలు చేసినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఎన్డీటీవీలో తమ వద్ద ఉన్న 32.26 వాటాలో 27.26 శాతం అదానీ గ్రూప్‌నకు అమ్మినట్లు ఈనెల 23న ప్రణయ్ రాయ్, ఆయన సతీమణి రాధికా రాయ్ వెల్లడించారు.
అదానీ చేతికి ప్రణయ్ రాయ్ దంపతుల NDTV వాటాలు - ఎన్డీటీవీ నామీనీలు
ఎన్డీటీవీ వ్యవస్థాపకులు రాధిక, ప్రణయ్ రాయ్ వద్ద నుంచి మెజారిటీ వాటాల కొనుగోలును అదానీ గ్రూప్ పూర్తి చేసింది. పరస్పర బదిలీ పద్ధతిలో ప్రణయ్ రాయ్ దంపతుల నుంచి 27.26 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. కొనుగోలు ప్రక్రియ శుక్రవారం పూర్తైనట్లు పేర్కొంది
ఇంతవరకు ఎన్డీటీవీలో విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ 8.27 శాతం వాటా, ఆర్ఆర్పీఆర్ 29.18 శాతం వాటా కలిగి ఉన్నాయి. తాజాగా ప్రణయ్ రాయ్ దంపతుల నుంచి 27.26 శాతం వాటా కొనుగోలు తర్వాత ఆర్ఆర్పీఆర్ వాటా 56.45 శాతానికి పెరిగింది. ప్రణయ్ రాయ్ దంపతులకు చెందిన 1.75 కోట్ల వాటాలను ఒక్కొక్కటి 342.45 రూపాయల చొప్పున రూ.602 కోట్లకు కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. కొనుగోలు ప్రక్రియ శుక్రవారం పూర్తైనట్లు పేర్కొంది.
అదానీ ఆధ్వర్యంలోని బోర్డులో ఉన్న ఇద్దరినీ నామినీలుగా గతవారం ఎన్డీటీవీ బోర్డు నియమించింది. ప్రస్తుతం ఎన్డీటీవీ ఛైర్మన్‌గా ప్రణయ్ రాయ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆయన సతీమణి రాధికా రాయ్ వ్యవహరిస్తున్నారు.