తెలంగాణ

telangana

ETV Bharat / business

కార్ల అమ్మకాల్లో రికార్డ్‌.. మారుతీ టాప్ గేర్.. హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌ జోరు - 2022లో వాహన పరిశ్రమ రికార్డులు న్యూస్

2022లో 23 శాతం వృద్ధితో వాహన పరిశ్రమ రికార్డులు బద్దలుకొట్టింది. దేశీయంగా ప్రయాణికుల వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో 37.93 లక్షలుగా నమోదయ్యాయి.

37.93 lakh sales in 2022 with a growth of 23 percent Maruti, Hyundai and Tata Motors excelled
కార్ల అమ్మకాల్లో రికార్డ్‌

By

Published : Jan 2, 2023, 9:03 AM IST

2022లో వాహన పరిశ్రమ రికార్డులు బద్దలుకొట్టింది. దేశీయంగా ప్రయాణికుల వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో 37.93 లక్షలుగా నమోదయ్యాయి. 2021లో అమ్ముడుపోయిన 30.81 లక్షల వాహనాలతో పోలిస్తే ఇవి 23 శాతం అధికం. కార్లు, స్పోర్ట్స్‌ వినియోగ వాహనాలు (ఎస్‌యూవీ), వ్యాన్లను కలిపి ప్రయాణికుల వాహనాలుగా పరిగణిస్తున్నారు. ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో పరిశ్రమకు ఇవే అత్యధిక విక్రయాలని.. 2018 టోకు విక్రయాలు 33.3 లక్షలే ఇప్పటివరకు రికార్డుగా ఉన్నట్లు మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (మార్కెటింగ్‌, అమ్మకాలు) శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అంతకంటే ఇప్పుడు 14 శాతం అధికంగా అమ్మకాలు జరిగాయన్నారు.

కార్ల అమ్మకాల్లో రికార్డ్‌
  • మొత్తం ప్రయాణికుల వాహన విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 42.3 శాతానికి పెరిగింది.
  • రూ.10 లక్షలు, అంతకుమించి విలువైన కార్ల అమ్మకాలే 40 శాతం మేర ఉన్నాయి.

ఏడాది మొత్తంమీద
2022లో కరోనా సంబంధిత సవాళ్లు, సెమీకండక్టర్‌ కొరత తగ్గడం కలిసొచ్చింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌ వంటి దిగ్గజ కంపెనీలు రాణించాయి. టయోటా కిర్లోస్కర్‌, స్కోడా ఇండియా వంటి సంస్థలూ రికార్డు విక్రయాలు సాధించాయి.

  • 2022లో మారుతీ సుజుకీ 15.76 లక్షల వాహనాలు విక్రయించింది. 2021లో విక్రయించిన 13.64 లక్షల వాహనాలతో పోలిస్తే 16 శాతం వృద్ధి నమోదైంది.
  • హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా విక్రయాలు 5,05,033 నుంచి 9.4 శాతం పెరిగి 5,52,511కు చేరాయి.
  • టాటా మోటార్స్‌ టోకున 5,26,796 వాహనాలు విక్రయించింది.
  • టయోటా కిర్లోస్కర్‌ అమ్మకాలు 1,30,768 నుంచి 23 శాతం వృద్ధితో 1,60,357 వాహనాలకు పెరిగాయి.
  • స్కోడా విక్రయాలు 23,858 నుంచి 53,721కు పెరిగాయి.
  • హోండా కార్స్‌ 2022లో 95,022 కార్లు విక్రయించింది. 2021 అమ్మకాలు 89,152తో పోలిస్తే ఇవి 7 శాతం ఎక్కువ.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details