2024 New Kia Sonet Facelift Launched : ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గురువారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో 2024 కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ నయా మోడల్‌ను లాంఛ్ చేశారు సంస్థ ప్రతినిధులు. ఇప్పటికే ఉన్న తమ కాంపాక్ట్ ఎస్యూవీ సోనెట్‌కు అప్డేటెడ్ వెర్షన్‌గా దీనిని పేర్కొంటున్నారు. ఈ ఎస్యూవీ టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజా మోడల్స్‌కు గట్టీ పోటీ ఇవ్వనున్నట్లు దీని ఫీచర్స్ చూస్తే అర్థమవుతోంది.
2024 Kia Sonet Facelift Specs And Features :అప్డేట్ చేసిన ఫ్రంట్ ఫేస్‌తో ఈ కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని తీర్చిదిద్దారు. ఈ మోడల్లో అన్ని రకాల భద్రతా ప్రమాణాలను పాటించినట్లు కియా ఇండియా తెలిపింది. మరి దీనికి సంబంధించి స్పెక్స్ అండ్ ఫీచర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
- రీడిజైన్డ్ బంపర్
- 360 డిగ్రీల కెమెరా సిస్టమ్
- రియర్ వ్యూ కెమెరా
- స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్
- ఇన్-కార్ కనెక్టివ్ టెక్
- వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్
- సింగిల్-పేన్ సన్‌రూఫ్
- వెంటిలేటెడ్ సీట్స్
- క్రూయిజ్ కంట్రోల్
- ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్
- ఆరు ఎయిర్ బ్యాగ్స్
- ఫ్రెంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్
- ఎల్ఈడీ హెడ్ లైట్స్
- ఎలక్ట్రికల్ అడ్జస్టెబుల్ డ్రైవర్ సీటు
- మూడు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్
- DRL యూనిట్లు
- ఫీచర్ లోడెడ్ క్యాబిన్
- కనెక్ట్ చేసిన LED స్ట్రిప్
- అప్డేటెడ్ స్లిమ్మర్ గ్రిల్
- అప్డేటెడ్ LED టెయిల్ లైట్లు
- 16 అంగుళాల రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్
- ఎల్ ఆకారంలో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు
- ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం
- బోస్ సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్
- సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
- ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్
- సిల్వర్ ఫాక్స్
- స్కిడ్ ప్లేట్
2024 Kia Sonet Dimensions :
2024 కియా సొనెట్ డైమెన్షన్స్ | |
పొడవు | 3995 |
వెడల్పు | 1790 |
ఎత్తు | 1647 |
వీల్‌బేస్ | 2500 |
గ్రౌండ్ క్లియరెన్స్ | 211 |
ఫ్యుయెల్ ట్యాంక్ కెపాసిటీ | 45 లీటర్లు |
బూట్ స్పేస్ | 392 లీటర్లు |
ఇంజిన్ ఆప్షన్స్!
కియా ఇండియా లాంఛ్ చేసిన ఈ నయా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో రెండు(పెట్రోల్, డీజిల్) ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 3 రకాల గేర్ బాక్స్ ఆప్షన్స్‌ను కార్ లవర్స్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇంజిన్ | 1.2L NA పెట్రోల్ | 1.0L టర్బో పెట్రోల్ | 1.5L డీజిల్ |
పవర్ | 83PS | 120PS | 100PS (MT)/115PS |
టార్క్ | 115Nm | 172Nm | 240Nm (MT)/250Nm |
ట్రాన్స్మిషన్ | 5-స్పీడ్ MT | 6-స్పీడ్ iMT/7-స్పీడ్ DCT | 6-స్పీడ్ MT/6-స్పీడ్ AT |