చివరికి లాభాలే..
స్టాక్‌మార్కెట్ సూచీలు ఇవాళ తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడింగ్ సాగించాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడినా.. చివరకు మాత్రం భారీ లాభాల్లో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగింది. చివరకు 44 వేల 259 వద్ద సెషన్‌ను ముగించింది. ఆరంభంలో ఈ సూచీ దాదాపు 250 పాయింట్ల మేర నష్టపోయి.. 43 వేల 582 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం.. పుంజుకొని పరుగులు పెట్టింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 129 పాయింట్ల లాభంతో 12 వేల 987 వద్ద స్థిరపడింది.
మొత్తం 1726 షేర్లు పెరిగాయి. 986 షేర్లు క్షీణించాయి. 179 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
లాభనష్టాల్లోనివివే..
నేటి సెషన్లో లోహరంగం షేర్లు అత్యధికంగా రాణించాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 6 శాతానికిపైగా పెరిగింది.
టాటా స్టీల్, గ్రేసిమ్, హిందాల్కో, బజాజ్ ఫినాన్స్, యాక్సిస్ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
ఐచర్ మోటార్స్, బీపీసీఎల్, మారుతీ సుజుకీ, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టపోయాయి.