తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock market: భారీగా నష్టపోయిన స్టాక్​ మార్కెట్లు - స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్

stock markets
స్టాక్ మార్కెట్లు

By

Published : Oct 20, 2021, 9:34 AM IST

Updated : Oct 20, 2021, 3:51 PM IST

15:44 October 20

స్టాక్​ మార్కెట్లు బుధవారం సెషన్​ నష్టాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​(Sensex Today) 456 పాయింట్లు కోల్పోయి. 61,259 వద్ద ముగించింది. నిఫ్టీ(Nifty today) 152 పాయింట్ల నష్టంతో 18,266 వద్ద స్థిరపడింది. టైటాన్​, హిందుస్థాన్ యూనిలివర్, ఎన్​టీపీసీ, బజాజ్​ఫిన్​సెర్వ్​, ఎల్​ అండ్​ టీ, పవర్​ గ్రిడ్ నష్టాలు మూటగట్టుకున్నాయి.

భారతీ ఎయిర్​టెల్​, ఎస్​బీఐఎన్, ఇండస్​ బ్యాంక్​, బజాజ్​ ఫైనాన్స్, ఐటీసీ లాభాలు గడించాయి.​

14:52 October 20

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా కోల్పోయి 61,190 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ 175 పాయింట్ల నష్టంతో 18,240 వద్ద ట్రేడవుతోంది.

  • భారతీ ఎయిర్​టెల్​, ఎస్​బీఐఎన్​, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్​, యాక్సిస్​ బ్యాంక్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • బజాజ్​, టైటాన్​, హిందుస్థాన్ యూనిలివర్, ఎల్​ అండ్​ టీ, ఎన్​టీపీసీ, పవర్​ గ్రిడ్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

12:04 October 20

స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 306 పాయింట్లు కోల్పోయి 61,409 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 112 పాయింట్ల నష్టంతో 18,306 వద్ద ట్రేడవుతోంది. 

11:03 October 20

స్టాక్​ మార్కెట్లు ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 61 వేల 695, నిఫ్టీ 18 వేల 400 వద్ద కొనసాగుతున్నాయి.

10:13 October 20

లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి తెరుకుని.. లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 126 పాయింట్ల లాభంతో 61,842 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 32 పాయింట్లకుపైగా పెరిగి.. 18,451 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • భారతీ ఎయిర్​టెల్​, ఎస్​బీఐఎన్​, హెచ్​సీఎల్​టెక్, ఇండస్​ బ్యాంక్​, టెక్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • బజాబ్​ ఫిన్​సెర్వ్​, బజాబ్​ ఆటో, కొటక్​బ్యాంక్​, బజాబ్​ ఫైనాన్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టీసీఎస్​ ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

08:57 October 20

స్టాక్​ మార్కెట్స్​ లైవ్​ అప్డేట్స్

స్టాక్ మార్కెట్లు(Stocks today) ఒడుదొడుకుల్లో ప్రారంభమయ్యాయి. బుధవారం సెషన్​ను స్వల్ప నష్టాలతో ప్రారంభించాయి సూచీలు. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today)  91 పాయింట్లకుపైగా కోల్పోయి.. 61,624 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 54 పాయింట్లకుపైగా నష్టంతో 18,364 వద్ద కొనసాగుతోంది.

  • నెస్లే, భారతీ ఎయిర్​టెల్​, హిందుస్థాన్ యూనిలివర్​, ఇన్​ఫోసిస్, హెచ్​సీఎల్​టెక్​, ఎల్​ అండ్​ టీ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • బజాబ్​ ఫైనాన్స్​, బజాబ్​ ఫిన్​సెర్వ్​, ఇండస్​ బ్యాంక్​, బజాజ్ ఆటో, టాటా స్టీల్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Last Updated : Oct 20, 2021, 3:51 PM IST

ABOUT THE AUTHOR

...view details