దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 392 పాయింట్ల లాభంతో 39,089 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 111 పాయింట్ల వృద్ధితో 11,528 వద్ద ట్రేడవుతోంది.
స్టాక్ మార్కెట్లలో జోష్- సెన్సెక్స్ 390 ప్లస్
10:29 October 05
10:22 October 05
స్టాక్ మార్కెట్ల జోష్- సెన్సెక్స్ 390 ప్లస్
దేశీయ మార్కెట్ల లాభాల్లో పయనిస్తున్నాయి. సోమవారం ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్ 490 పాయింట్లు ఎగబాకి 39,194 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 11,552 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.57 వద్ద కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కావొచ్చన్న ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకున్నాయి. మరోవైపు కీలక కంపెనీల షేర్లు రాణిస్తుండడం సూచీలకు దన్నుగా నిలిచింది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, విప్రో లిమిటెడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. గెయిల్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.