ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన స్టాక్మార్కెట్లు... చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 86 పాయింట్లు పెరిగి 39 వేల 616 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 11 వేల 871 వద్ద ముగిసింది.
దేశీయంగా, అంతర్జాతీయంగా మిశ్రమ పరిస్థితుల మధ్య సూచీలు రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 39 వేల 279 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. తర్వాత కోలుకుని 39 వేల 703 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. కాసేపటికే నెమ్మదించిన సూచీ... స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది.
వారం మొత్తంగా సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 52 పాయింట్లు కోల్పోయింది.
లాభాల్లో...
ఇండస్ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్, ఎమ్ అండ్ ఎమ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, వేదాంత (సుమారు 1.90 శాతం) లాభాలను ఆర్జించాయి.
నష్టాల్లో..