తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 883 డౌన్​ - షేర్ మార్కెట్ అప్​డేట్స్

stocks live updates
స్టాక్ మార్కెట్లు లైవ్​ అప్​డేట్స్

By

Published : Apr 19, 2021, 9:31 AM IST

Updated : Apr 19, 2021, 3:43 PM IST

15:37 April 19

14,400 దిగువకు నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు వారంలో మొదటి సెషన్​ను భారీ నష్టాలతో ముగించాయి. సెన్సెక్స్ 883 పాయింట్ల నష్టంతో 47,949 వద్దకు చేరింది. నిఫ్టీ 258 పాయింట్లు కోల్పోయి 14,359 వద్ద స్థిరపడింది.

30 షేర్ల ఇండెక్స్​లో డాక్టర్ రెడ్డీస్​, ఇన్ఫోసిస్ స్వల్పంగా లాభపడ్డాయి.  పవర్​గ్రిడ్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఓఎన్​జీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్​ భారీగా నష్టపోయాయి.

14:04 April 19

కొనసాగుతున్న నష్టాలు..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 870 పాయింట్లకుపైగా క్షీణించి.. 47,952 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 260 పాయింట్ల నష్టంతో 14,358 వద్ద కొనసాగుతోంది. మిడ్​ సెషన్​ ముందుతో పోలిస్తే నష్టాలు కాస్త తగ్గాయి.

  • ఇన్ఫోసిస్​, డాక్టర్​ రెడ్డీస్​, హెచ్​సీఎల్​టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ మూడు కంపెనీలు మాత్రమే సానుకూలంగా స్పందిస్తున్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్​ బ్యాంక్, పవర్​గ్రిడ్, ఓఎన్​జీసీ, కోటక్​ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:46 April 19

ఇండస్​ఇండ్ 4.4 శాతం డౌన్​..

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,120 పాయింట్లకుపైగా కోల్పోయి 47,717 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 310 పాయింట్లకుపైగా నష్టంతో 14,301 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • 30 షేర్ల ఇండెక్స్​లో డాక్టర్​ రెడ్డీస్​, ఇన్ఫోసిస్​ మాత్రమే లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:05 April 19

బ్యాంకింగ్‌ షేర్ల బెంబేలు...

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ దాదాపు 1230 పాయింట్ల నష్టంతో 47,602 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 360 పాయింట్లు కోల్పోయి 14,258 వద్ద కొనసాగుతోంది.

దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటం నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

30 షేర్ల ఇండెక్స్​లో అన్ని కంపెనీలు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ, యాక్సిస్​ బ్యాంక్​ షేర్లు ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

Last Updated : Apr 19, 2021, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details