తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆటుపోట్ల ట్రేడింగ్​లో రెండో రోజూ లాభాలే.. - నిప్టీ

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Apr 28, 2020, 9:31 AM IST

Updated : Apr 28, 2020, 3:48 PM IST

15:45 April 28

32 వేల ఎగువకు సెన్సెక్స్...

ఉదయం నుంచి ఆటుపోట్ల మధ్య జరిగిన ట్రేడింగ్​లో వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 371 పాయింట్లు బలపడి 32,114 వద్దకు చేరింది. నిఫ్టీ 99 పాయింట్ల వృద్ధితో 9,381 వద్ద స్థిరపడింది.

ఒడుదొడుకుల్లోనూ ఆర్థిక రంగం షేర్లు సానుకూలంగా స్పందించడం నేటి లాభాలకు ప్రధాన కారణం.

30 షేర్ల ఇండెక్స్​లో...

ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.

సన్​ఫార్మా, నెస్లే, ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​టెక్ షేర్లు నష్టాల జాబితాలో ఉన్నాయి.

12:22 April 28

స్వల్ప లాభాల్లో సూచీలు

మిడ్ సెషన్​లో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో 31,793 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిప్టీ దాదాపు 10 పాయింట్ల వృద్ధితో 9,297 వద్ద ట్రేడవుతోంది.

ఇండస్​ ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫినాన్స్, యాక్సిస్​ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, హెచ్​సీఎల్​టెక్​, బజాజ్ ఆటో, రిలయన్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:59 April 28

మళ్లీ లాభాల్లోకి సూచీలు..

స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా బలపడి 31,450 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల లాభంతో 3,310 వద్ద ట్రేడవుతోంది.

అమ్మకాల ఒత్తిడి ఉన్నా.. బ్యాంకింగ్ రంగ షేర్ల సానుకూలతలు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్​ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.  

బజాజ్ ఆటో, హెచ్​సీఎల్​టెక్, రిలయన్స్, సన్​ఫార్మా, ఎన్​టీపీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:00 April 28

లాభాలకు బ్రేక్​...

లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 10 పాయింట్లకుపైగా క్షీణతతో 31,731 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 9,278 వద్ద ఫ్లాట్​గా ట్రేడింగ్ సాగిస్తోంది.

చివరి సెషన్​లో నమోదైన లాభాలను మదుపరులు సొమ్ముచేసుకునే పనిలో పడటం ఒడుదొడుకులకు కారణంగా చెబుతున్నారు నిపుణులు. మరో వైపు దేశవ్యాప్తంగా మూడో దశ లాక్​డౌన్​పై అంచనాలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు.

09:13 April 28

కొనసాగుతున్న లాభాలు..

స్టాక్​ మార్కెట్లు నేడూ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 240 పాయింట్లకుపైగా లాభంతో ప్రస్తుతం  31,988 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 60 పాయింట్లకు పైగా వృద్ధితో 9,345 వద్ద ట్రేడవుతోంది.

బ్యాంకింగ్, ఐటీ, వాహన రంగ షేర్లు సానుకూలంగా ట్రేడవుతుండటం లాభాలకు కారణంగా తెలుస్తోంది. 

30 షేర్ల ఇండెక్స్​లో ఇండస్​ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, టెక్​ మహీంద్రా, ఎం&ఎం, హీరో మోటోకార్ప్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్​జీసీ, హెచ్​సీఎల్​టెక్, పవర్​గ్రిడ్, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Apr 28, 2020, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details