తెలంగాణ

telangana

ETV Bharat / business

stock market: ఒడుదొడుకుల్లో సూచీలు- 18 వేల దిగువకు నిఫ్టీ

stock markets
స్టాక్ మార్కెట్లు

By

Published : Nov 17, 2021, 9:34 AM IST

Updated : Nov 17, 2021, 12:29 PM IST

12:17 November 17

నష్టాల్లో మార్కెట్లు..

దేశీయ స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. సెషన్ ఆరంభంలో నష్టాల్లో ఉన్న మార్కెట్లు.. కాసేపటికే సానుకూలంగా ట్రేడయ్యాయి. అయితే.. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాలతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్​ 114 పాయింట్లకుపైగా కోల్పోయి 60,208 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 18వేల దిగువకు చేరింది.

ఫార్మా, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండగా.. ఐటీ షేర్లు రాణిస్తున్నాయి.

10:26 November 17

స్టాక్​ మార్కెట్ లైవ్​ అప్​డేట్​

నష్టాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్.. స్వల్పంగా 34 పాయింట్లు లాభపడి 60,356వద్ద కదలాడుతోంది. అటు.. నిఫ్టీ సైతం ఆరంభ నష్టాల నుంచి తేరుకుని అతిస్వల్పంగా 7 పాయింట్ల వృద్ధితో.. 18,006 వద్ద ట్రేడవుతోంది.

08:42 November 17

స్టాక్​ మార్కెట్లు లైవ్​

స్టాక్ మార్కెట్లు (Stocks today) బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 152 పాయింట్లకు పైగా నష్టంతో.. 60,171 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 42 పాయింట్లు క్షీణించి 17,958 వద్ద కొనసాగుతోంది. 

  • ఏషియన్​ పెయింట్స్, ​ఎన్​టీపీసీ, మారుతీ, పవర్​గ్రిడ్, ఐటీసీ, ఎం అండ్​ ఎం ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్, డా.రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, కోటక్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Nov 17, 2021, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details