తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock market news: స్టాక్​ మార్కెట్​లకు నష్టాలు.. సెన్సెక్స్​ @60,029

STOCK MARKETS LIVE
స్టాక్​మార్కెట్​ సూచీలు

By

Published : Nov 2, 2021, 9:33 AM IST

Updated : Nov 2, 2021, 3:49 PM IST

15:46 November 02

ఆరంభ లాభాలు ఆవిరి..

స్టాక్​ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​(Sensex today) 109 పాయింట్లు కోల్పోయి 60,029 వద్ద సెషన్​ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ(Nifty today) 40 పాయింట్ల నష్టంతో 17,889 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడే సాగిందిలా..

సోమవారం సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఇదే జోరు ఉదయం సెషన్​లో కొనసాగింది. సెన్సెక్స్ 60,421 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. అయితే మిడ్​ సెషన్​లో మదుపర్లు కీలక రంగాల్లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల.. సెన్సెక్స్​ సుమారు 400 పాయింట్లు నష్టపోయింది. 59,882 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

నిఫ్టీ 18,012 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,848 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాలు..

మారుతి, టైటాన్​, ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, సన్​ఫార్మా షేర్లు లాభాలను గడించాయి.

టాటా స్టీల్​, టెక్​ మహీంద్ర, రిలయన్స్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​, పవర్​ గ్రిడ్​, డాక్టర్​ రెడ్డీస్​​ షేర్లు నష్టాలను చవిచూశాయి.

11:46 November 02

ఒడుదొడుకుల్లో మార్కెట్లు..

స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల వెల్లువతో నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 30 పాయింట్లకుపైగా నష్టంతో 61 వేల 103 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 9 పాయింట్లు పడిపోయి 17,920 వద్ద ఫ్లాట్​గా ట్రేడవుతోంది.

10:36 November 02

లాభాలతో ప్రారంభమైన స్టాక్​ మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​సీ-సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా కోల్పోయి.. 59,994 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి.. 17,887 వద్ద కొనసాగుతోంది.

09:05 November 02

లాభాలతో ప్రారంభమైన స్టాక్​మార్కెట్​ సూచీలు

స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 150 పాయింట్లకుపైగా పెరిగి.. 60,297 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 50 పాయింట్లకుపైగా లాభంతో.. 17,981 వద్ద కొనసాగుతోంది.

అక్టోబరులో జీఎస్​టీ వసూళ్లు పెరగటం, కంపెనీల త్రైమాసిక ఫలితాలు బాగుండటం, అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయిలో సానుకూలంగా ముగియడం వంటి సానుకూలతలు లాభాలకు కారణంగా తెలుస్తోంది.

ఎన్​టీపీసీ, మారుతీ, పవర్​గ్రిడ్​, బజాజ్​ఫిన్​సెర్వ్​, బజాజ్​ ఫైనాన్స్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

సన్​ఫార్మా, టెక్​మహీంద్రా, టాటాస్టీల్​, ఇండస్​బ్యాంకు, డాక్టర్​రెడ్డీస్​, కొటక్​బ్యాంకు ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Nov 2, 2021, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details