తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక షేర్ల దూకుడు- లాభాల్లో మార్కెట్లు

stock markets live updates sensex rallies 500 points plus
ఆర్థిక షేర్ల దూకుడు- లాభాల్లో మార్కెట్లు

By

Published : Mar 1, 2021, 9:26 AM IST

Updated : Mar 1, 2021, 4:17 PM IST

15:53 March 01

బ్యాంకింగ్​ షేర్ల దూకుడు-లాభాలతో ముగిసిన సూచీలు

స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండటం సహా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఉత్సాహకరమైన సంకేతాలు అందుకున్న సూచీలు లాభాల బాట పట్టాయి. ఒకానొక దశలో సెన్సెక్స్​ 50 వేల మార్క్​ను చేరింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 750 పాయింట్లు పెరిగింది. చివరకు 49,850 వద్ద సెషన్​ను ముగించింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 232 పాయింట్లు వృద్ధి చెంది.. 14,762 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లో..

పవర్​ గ్రిడ్​, ఓఎన్​జీసీ, ఏషియన్​ పెయింట్స్​, కోటక్​బ్యాంక్​, టైటాన్​, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​సీఎల్​ టెక్​, టెక్​ మహీంద్రా షేర్లు రాణించాయి.

30 షేర్ల ఇండెక్స్​లో భారతీ ఎయిర్​టెల్​​ మాత్రమే నష్టపోయింది.

11:07 March 01

కొనసాగుతోన్న బుల్​ జోరు- 50 వేలకు చేరువలో సెన్సెక్స్​

స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండటం సహా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఉత్సాహకరమైన సంకేతాలు అందుకున్న సూచీలు లాభాల బాట పట్టాయి. ఒకానొక దశలో సెన్సెక్స్​ 50 వేల మార్క్​ను చేరింది. బీఎస్​ఈ సెన్సెక్స్ 855 పాయింట్లు వృద్ధి చెంది 49,955 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 260 పాయింట్లు పెరిగి 14,789 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

ఎం&ఎం, ఓఎన్​జీసీ, టైటాన్​, పవర్​గ్రిడ్​, టెక్​ మహేంద్ర, కోటక్​ బ్యాంక్​, హెచ్​సీఎల్​ టెక్​లు లాభాల్లో కొనసాగుతున్నాయి. 

30 షేర్ల ఇండెక్స్​లో ఒక్క భారతీ ఎయిర్​టెల్​ మాత్రమే నష్టాల్లో కొనసాగుతోంది.

09:09 March 01

ఆర్థిక షేర్ల దూకుడు- లాభాల్లో మార్కెట్లు

అంతర్జాతీయంగా సానుకూలతలు నెలకొన్న కారణంగా దేశీయ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 500 పాయింట్లు వృద్ధి చెంది 49,600 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 155 పాయింట్లు పెరిగి 14,684 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఓఎన్​జీసీ, ఇన్ఫోసిస్​, హెచ్​సీఎల్ టెక్, ఎస్​బీఐ, ఎం&ఎం, బజాజ్​ ఫినాన్స్​, పవర్​గ్రిడ్​ లాభాల్లో ఉన్నాయి.

30 షేర్ల ఇండెక్స్​లో ఒక్క భారతి ఎయిర్​టెల్​ మాత్రమే నష్టాల్లో కొనసాగుతోంది.

Last Updated : Mar 1, 2021, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details