తెలంగాణ

telangana

By

Published : Jan 31, 2021, 3:48 PM IST

ETV Bharat / business

బడ్జెట్​ ప్రకటనలు, వడ్డీ రేట్లే కీలకం!

కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. స్థూల ఆర్థిక గణాంకాలు, ఆర్బీఐ విధానాలు, కార్పొరేట్ ఫలితాలు సూచీలను ప్రభావితం చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

Stock markets ahead: Budget, RBI policy major events to watch out for
బడ్జెట్​ వేళ.. స్టాక్​ మార్కెట్లపై మదుపరుల నజర్

కేంద్ర బడ్జెట్, స్థూల ఆర్థిక గణాంకాలు, రిజర్వు బ్యాంకు ద్రవ్యపరపతి విధానం, దిగ్గజ సంస్థల త్రైమాసిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఈ వారం స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం అందరి చూపు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్​పైనే ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేలా సానుకూల నిర్ణయాలు ఉంటాయని మదుపరులు ఆశిస్తున్నారు. అలా జరగదని భావిస్తే మార్కెట్లు భారీ దిద్దుబాటు చర్యలకు లోనవుతాయి.

-అజిత్​ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు.

బడ్జెట్​పై అంచనాలతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతారు.. ఈ క్రమంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే ప్రమాదముంది.

-సిద్ధార్థ్ ఖేమ్కా, మోతీలాల్​ ఓస్వాల్ రిటైల్ హెడ్

త్రైమాసిక ఫలితాలే కీలకం..

బడ్జెట్​ వారంలో దేశీయ మర్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్న అంశాలను గమనిస్తే.. వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాలపై మదుపరులు దృష్టి సారించే అవకాశాలున్నాయి. ప్రధానంగా.. హెచ్​డీఎఫ్​సీ, అదానీపవర్​, హీరో మోటోకార్ప్, ఎంఅండ్ఎం వంటి కంపెనీలు తమ ఫలితాలను ప్రకటించనున్నాయి.

వడ్డీరేట్లపై ఆర్బీఐ నిర్ణయాలు సైతం దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్లను ప్రభావితం చేయొచ్చని నిపుణులు అంటున్నారు.

గణాంకాలూ ముఖ్యమే..

ఉత్పత్తి, సేవా రంగాల గణాంకాలపై ఈ వారం వెలువడనున్న పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) సైతం మార్కెట్ల గమనానికి కీలకం కానుంది. ఇక సోమవారం​ విడుదల కానున్న వాహన విక్రయ గణాంకాలను(నెలవారీ) మదుపరులు పరిగనణలోకి తీసుకుంటారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. విదేశీ మదుపరులు సైతం భారత మార్కెట్లను అంచనా వేస్తూ ముందుకు సాగే అవకాశం ఉంది.

ఇవీ చదవండి: 'స్టాక్‌ మార్కెట్‌ నుంచి డబ్బులు వెనక్కి వెళ్తాయ్'
బడ్జెట్ 2021: అంకురాల ఆశలు నెరవేరేనా?

'లాక్​డౌన్​ విధించడం ఆర్థిక వ్యవస్థకు మేలైంది'

ఆర్థిక సర్వే 2020-21 హైలైట్స్

ABOUT THE AUTHOR

...view details