వరుస లాభాలతో రికార్డుల మోత మోగించిన స్టాక్ మార్కెట్ల జోరుకు బుధవారం బ్రేక్ పడింది. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 214 పాయింట్లు కోల్పోయి 57,338 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 56 పాయింట్ల నష్టంతో 17,076 వద్ద ముగిసింది.
వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకోవడం వల్ల సూచీలు నష్టాలను నమోదు చేసినట్లు నిపుణులు విశ్లేషించారు. బ్యాంకింగ్ షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్57,919 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 57,277 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,226 పాయింట్ల గరిష్ఠ స్థాయి (నూతన రికార్డు స్థాయి), 17,055 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.