తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock Market: బుల్​ జోరుకు బ్రేక్.. నష్టాల్లో సూచీలు - సెన్సెక్స్ సూచీ

స్టాక్ మార్కెట్ల జోరుకు సోమవారం బ్రేక్ పడింది. హెవీ వెయిట్ షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో ఈ రోజు సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 189 పాయింట్లు కోల్పోయి 52,735కు చేరింది. నిఫ్టీ (Nifty Today) 45 పాయింట్ల నష్టంతో.. 15,814 వద్ద ముగిసింది.

stock market today
స్టాక్ మార్కెట్

By

Published : Jun 28, 2021, 3:51 PM IST

స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలను నమోదు చేశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్(Sensex today) 189 పాయింట్లు తగ్గి 52,735 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 45 పాయింట్ల నష్టంతో 15,814 వద్దకు చేరింది.

ఐటీ, హెవీవెయిట్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురైనందువల్ల స్టాక్​ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 53,126 పాయింట్ల అత్యధిక స్థాయి.. 52,673 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 15,915 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,792 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టాటా స్టీల్, డా.రెడ్డీస్, టెక్​మహీంద్రా, సన్ ఫార్మా, హెచ్​యూఎల్​​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

టీసీఎస్, టైటాన్, హెచ్​సీఎల్, రిలయన్స్​, బజాజ్​​ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, హాంగ్​సెంగ్​, కోస్పీ సూచీలు నష్టాలతో ముగిశాయి.

ఇదీ చదవండి:తొలి రోజు ట్రేడింగ్​లో కిమ్స్, దొడ్ల డెయిరీ అదరహో..!

ABOUT THE AUTHOR

...view details