స్టాక్ మార్కెట్లకు మళ్లీ లాభాలు..
స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్లో మళ్లీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 697 పాయింట్లు పెరిగి.. 57 వేల 989 వద్ద ముగిసింది. నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 17 వేల 316 వద్ద స్థిరపడింది.
15:36 March 22
స్టాక్ మార్కెట్లకు మళ్లీ లాభాలు..
స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్లో మళ్లీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 697 పాయింట్లు పెరిగి.. 57 వేల 989 వద్ద ముగిసింది. నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 17 వేల 316 వద్ద స్థిరపడింది.
14:30 March 22
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 515 పాయింట్లకుపైగా లాభంత 57వేల 810 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు వృద్ధి చెంది 17,260 వద్ద ట్రేడవుతోంది.
11:47 March 22
స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 268 పాయిట్లకు పైగా కోల్పోయింది. ప్రస్తుతం 57,023 వద్ద కొనసాగుతుంది. మరో సూచీ నిఫ్టీ కూడా 83 పాయింట్ల నష్టంతో 17,034 వద్ద ట్రేడవుతుంది.
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, దేశీయంగా చమురు ధరల పెరుగుదల సూచీలను కలవరపెడుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు నష్టాల్ని చవిచూశాయి. నేడు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలకు నష్టాలు తప్పలేదు.
అమెరికాలో వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యలభ్యతను తగ్గించే ప్రక్రియ వేగంగా ఉండనుందని ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ సోమవారం ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు కూడా నేడు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు గతవారంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు 20 శాతం మేర పెరిగాయి. దేశీయంగా చమురు మార్కెటింగ్ సంస్థలు రిటైల్ ధరల్ని పెంచాయి. అలాగే వంటగ్యాస్ ధరలు సైతం పెరిగాయి. ఈ పరిణామాలు ద్రవ్యోల్బణ భయాల్ని మరింత పెంచాయి. దీంతో మదుపరులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
సోమవారం విదేశీయ సంస్థాగత మదుపర్లు భారీ ఎత్తున కొనుగోళ్లకు దిగారు. అత్యధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ, మందగమనానికి గురయ్యే పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థకు రాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నరు శక్తికాంత దాస్ సోమవారం భరోసా ఇవ్వడమొక్కటే నేడు మార్కెట్లకు సానుకూలాంశంగా కనిపిస్తోంది.
09:08 March 22
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్
Stock Market Live Updates: స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్‌ను నష్టాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ- సెన్సెక్స్ 9 పాయింట్లకుపైగా తగ్గి.. 57,283 వద్ద కదలాడుతోంది. మరో సూచీ నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో .. 17,139 వద్ద ట్రేడవుతోంది.
లాభనష్టాలు...
టాటా స్టీల్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
హిందుస్థాన్ యూనీలివర్, నెస్లే, ఏసియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.