తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లపై యుద్ధ మేఘాలు- సెన్సెక్స్​ 149 డౌన్​ - సెన్సెక్స్ నిఫ్టీ

STOCK MARKET LIVE UPDATES
STOCK MARKET LIVE UPDATES

By

Published : Feb 21, 2022, 9:23 AM IST

Updated : Feb 21, 2022, 3:42 PM IST

15:39 February 21

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, రష్యా-ఉక్రెయిన్​ యుద్ధ భయాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బ్యాంకు సెక్టార్​ మినహా.. క్యాపిటల్​ గూడ్స్​, ఎఫ్​ఎంసీజీ, మెటల్​, ఆయిల్​ అండ్​ గ్యాస్​, ఫార్మా రంగాలు 1 శాతం మేర నష్టపోయాయి. బీఎస్​ఈ మిడ్​క్యాప్​, స్మాల్​క్యాప్​ సూచీలు నష్టాలు మూటగట్టుకున్నాయి.

బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 149 పాయింట్ల నష్టంతో 57,684 వద్ద ముగిసింది.

ఇంట్రాడేలో.. సెన్సెక్స్​ దాదాపు 300 పాయింట్లకు పైగా నష్టంతో 57,551 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 57,167 పాయింట్ల కనిష్ఠ, 58,141 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 57,684 పాయింట్ల వద్ద స్థిరపడింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించి 17,207 పాయింట్ల వద్ద స్థిరపడింది

లాభనష్టాల్లోనివి...

పవర్​ గ్రిడ్​, శ్రీ సిమెంట్​, ఇన్ఫోసిస్​, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్​లు లాభాలతో ముగిశాయి.

కోల్​ ఇండియా, హిందాల్కోలు 3 శాతానికిపైగా నష్టపోయాయి. యూపీఎల్​, ఓఎన్​జీసీ, సన్​ఫార్మాలు 2.5 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.

11:17 February 21

స్టాక్ మార్కెట్లు ఇంకా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఆరంభంలో భారీగా పడిపోయిన సెన్సెక్స్.. ప్రస్తుతం 120 పాయింట్లు క్షీణించి.. 57,730 వద్ద కదలాడుతోంది.

53 పాయింట్లు పతనమైన నిఫ్టీ.. 17,223 వద్ద ట్రేడవుతోంది.

08:47 February 21

స్టాక్ మార్కెట్ లైవ్ అప్​డేట్స్

అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 324 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం 57,508 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్​లోని మెజారిటీ షేర్లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. విప్రో, సన్​ఫార్మా, ఏషియన్ పేంట్స్ భారీగా పతనమయ్యాయి.

అటు నిఫ్టీ సైతం నష్టాలతోనే ట్రేడింగ్ ఆరంభించింది. 100 పాయింట్లు కోల్పోయి.. 17,173 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయంగా..

అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు డీలా పడ్డాయి.

Last Updated : Feb 21, 2022, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details