తెలంగాణ

telangana

ETV Bharat / business

Stock market: స్టాక్​ మార్కెట్లకు భారీ లాభాలు- సెన్సెక్స్​ 672 పాయింట్లు ప్లస్​

Stock market
స్టాక్​ మార్కెట్​

By

Published : Jan 4, 2022, 9:22 AM IST

Updated : Jan 4, 2022, 3:52 PM IST

15:39 January 04

స్టాక్​ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ- సెన్సెక్స్ 672 పాయింట్లు లాభపడి 59వేల 855వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ 179పాయింట్ల లాభపడి 17వేల 814 వద్ద స్థిరపడింది.

లాభనష్ఠాలు

  • ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, ఎస్​బీఐఇన్, రిలయన్స్, టైటాన్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ, కొటక్​ ఫైనాన్స్, మారుతి షేర్లు లాభాలు గడించాయి.
  • ఇన్​ఫీ, డాక్టర్​ రెడ్డీస్, సన్​ఫార్మా, అల్ట్రాసిమ్​​కో, ఇండస్​ఐండ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

08:49 January 04

Stock market live: లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, హెవీ వెయిట్​ షేర్లు రాణించటంతో కొత్త ఏడాదిలో రెండో రోజూ.. దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 17,600 పైన ట్రేడవుతోంది.

  • బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​- 263 పాయింట్ల లాభంతో 59,446 వద్ద ట్రేడవుతోంది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ- 72 పాయింట్ల వృద్ధితో 17,698 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

  1. టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, మారుతీ సుజూకీ, యాక్సిస్​ బ్యాంక్​, బీపీసీఎల్​లు దాదాపు 1 శాతానికిపైగా లాభాల్లో కొనసాగుతున్నాయి.
  2. టాటా మోటార్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐచర్​ మోటార్స్​, ఇన్ఫోసిస్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Jan 4, 2022, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details