సానుకూలంగా ఆర్థిక షేర్లు- లాభాల్లో మార్కెట్లు - స్టాక్ మార్కెట్
09:01 December 28
స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్
stock market live updates: అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల మధ్య దేశీయ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 346 పాయింట్ల లాభంతో 57,766 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 100 పాయింట్లు మెరుగుపడి 17,186 వద్ద కొనసాగుతోంది.
ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఎం అండ్ ఎం, టైటాన్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టెక్ మహీంద్ర, నెస్లే, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.