తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లకు నష్టాలు- సెన్సెక్స్ 257 పాయింట్లు డౌన్

Stock Market Live Updates
స్టాక్​ మార్కెట్లు లైవ్​

By

Published : Nov 3, 2021, 9:31 AM IST

Updated : Nov 3, 2021, 3:52 PM IST

15:51 November 03

స్టాక్​ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​(Sensex today) 257 పాయింట్లు కోల్పోయి 59,772 వద్ద సెషన్​ను ముగించింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ(Nifty today) 60 పాయింట్ల నష్టంతో 17,829 వద్ద స్థిరపడింది.

13:34 November 03

లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్​ మార్కెట్ సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్​ 200 పాయింట్లకుపైగా కోల్పోయి.. 59,792 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయి.. 17,815 వద్ద ట్రేడవుతోంది.

12:07 November 03

స్టాక్​ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 59,950 వద్ద ఫ్లాట్​గా కొనసాగుతోంది. నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 17,890 వద్ద ఊగిసలాడుతోంది.

09:05 November 03

స్టాక్​ మార్కెట్లు లైవ్​

స్టాక్ మార్కెట్లు (Stocks today) బుధవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 200 పాయింట్లకుపైగా లాభంతో.. 60,234 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) దాదాపు 57 పాయింట్లు పెరిగి 17,946 వద్ద కొనసాగుతోంది. 

టెక్ మహీంద్రా, ఎన్​టీపీసీ, ఎల్​ అండ్​ టీ, అల్ట్రాటెక్​ సిమెంట్​,  బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఎస్​బీఐఎన్​ ప్రధానంగా లాభాల్లో కొనసాగుతున్నాయి.

టైటాన్​, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, ఏసియన్​ పెయింట్స్​ హిందుస్థాన్​ యూనిలివర్​ షేర్లు ఎక్కువగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Last Updated : Nov 3, 2021, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details