తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 126 డౌన్​ - స్టాక్​ మార్కెట్​ వార్తలు తాజా

stockmarket live
లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : Sep 17, 2021, 9:48 AM IST

Updated : Sep 17, 2021, 3:41 PM IST

15:40 September 17

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex today) 126 పాయింట్లు తగ్గి 59,015వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 44 పాయింట్ల నష్టంతో 17,585 వద్దకు చేరింది.

  • కోటక్ మహీంద్రా బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, మారుతీ సుజుకీ, యాక్సిస్​ బ్యాంక్​ ప్రధానంగా లాభాలను గడించాయి.
  • టాటా స్టీల్​, ఎస్​బీఐ, టీసీఎస్​, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్​ ఫార్మా​ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు లాభాలను గడించాయి. చివరి సెషన్​లో ఈ సూచీలన్నీ నష్టాలను మూటగట్టుకోవడం గమనార్హం.

14:35 September 17

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 210 పాయంట్లకుపైగా కోల్పోయి 58,929 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా తగ్గి.. 17,554 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.

  • కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్​టెల్, బజాజ్ ఫినాన్స్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • టాటా స్టీల్​, ఎస్​బీఐ, సన్​ ఫార్మా, ఎన్​టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

12:48 September 17

స్టాక్ మార్కెట్​లో ఎస్​బీఐ షేర్లు ప్రస్తుతం 2.2 శాతానికిపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. బీఎస్​ఈలో షేరు విలువ రూ.453 వద్ద కొనసాగుతోంది. అయితే ఇటీవలే ఎస్​బీఐ షేరు విలువ జీవనకాల గరిష్ఠమైన రూ.470 మార్క్​ను తాకింది. బీఎస్​ఈ ప్రకారం ఎస్​బీఐ మార్కెట్ క్యాపిటల్ ప్రస్తుతం రూ.4.04 లక్షల కోట్లుగా ఉంది.

12:37 September 17

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. ఒకానొక దశలో 59,700 పైకి చేరిన సెన్సెక్స్​.. ప్రస్తుతం 40 పాయిట్ల స్వల్ప లాభంతో 59,183 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 17,620 వద్ద ఫ్లాట్​గా ట్రేడింగ్​ సాగిస్తోంది.

బ్యాంకింగ్, ఫార్మా షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • బజాజ్ ఫిన్​సర్వ్​, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్​ ఫినాన్స్​, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్​టెల్​ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • టాటా స్టీల్​, ఎస్​బీఐ, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, డాక్టర్​ రెడ్డీస్​, సన్​ఫార్మా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:17 September 17

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు(stock market today) శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ ప్రస్తుతం 350 పాయింట్లు లాభపడి 59,491కి చేరుకుంది. 

ఆరంభంలో దాదాపు 480 పాయింట్లు పెరిగి.. 59 వేల 619ని తాకింది. ఇది జీవనకాల గరిష్ఠం. 

నిఫ్టీ 95 పాయింట్లు పెరిగి 17,725 వద్ద ట్రేడవుతోంది.  

ఐటీసీ, బజాజ్​ ఫైనాన్స్​, టైటాన్​, భారతీ ఎయిర్​టెల్, కోటక్​బ్యాంక్​ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.  

పవర్​గ్రిడ్​, ఇండస్​బ్యాంక్, ఎన్​టీపీసీ, ఎస్​బీఐఎన్​​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.  

Last Updated : Sep 17, 2021, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details