తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 17వేల దిగువకు నిఫ్టీ - స్టాక్​ మార్కెట్​ లైవ్​

stock market live updates today
నష్టాల్లో మార్కెట్లు

By

Published : Dec 6, 2021, 9:25 AM IST

Updated : Dec 6, 2021, 3:55 PM IST

15:53 December 06

Stock Market Updates: సోమవారం కూడా స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 949 పాయింట్లు కోల్పోయి 56,747 వద్దకు చేరింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 284 పాయింట్లు క్షీణించి 16,912 వద్ద స్థిరపడింది.

నష్టాలకు కారణాలు ఇవే..

  • దేశీయంగా ఆదివారం ఒక్కరోజే 17 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశీయ మదుపరులు అమ్మకాలకు దిగారు.
  • ఆర్థిక వ్యవస్థలు మళ్లీ అనిశ్చితిలోకి జారుకుంటాయనే ఆందోళన మదుపరుల్లో వ్యక్తమైంది.
  • ఐరోపా, ఆఫ్రికా, ఇతర దేశాల్లో కొవిడ్‌ కొత్త కేసులు పెరగడం, ప్రభుత్వాలు ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధిస్తుండటం వల్ల ఆర్థిక రికవరీకి ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బకొట్టాయి.
  • విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగాయి.
  • మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం ఒక్కటి కూడా లేకపోవడం నష్టాలకు మరో కారణంగా చెప్పవచ్చు.
  • స్టాక్​ మార్కెట్​లో ఉండే బడా కంపెనీలు కూడా నష్టాల్లో ట్రేడవడం మదుపరులను ఆందోళనకు గురిచేసింది.
  • బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు నష్టాలను చవి చూశాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 57,781 పాయింట్ల అత్యధిక స్థాయి, 56,687 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,216 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 16,891 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

ముప్పై షేర్ల ఇండెక్స్​లోని షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి.

14:53 December 06

భారీ నష్టాలు.. సెన్సెక్స్​ 800 డౌన్​

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 801 పాయింట్ల నష్టంతో 56,895 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 17వేల దిగువకు చేరింది. ప్రస్తుతం 244 పాయింట్ల నష్టంతో 16,953 వద్ద కొనసాగుతోంది.

బీఎస్​ఈ సెన్సెక్స్​లో ఒక్క కంపెనీ షేరు కూడా లాభాల్లో లేదు. అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఇండస్​ఇండ్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, హెచ్​సీఎల్​ టెక్​ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

14:23 December 06

భారీ నష్టాల్లో మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 649 పాయింట్లు పతనమై 57,058 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 195 పాయింట్లు నష్టపోయి 17,002 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్​ 30లో హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ మినహా అన్ని షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

11:57 December 06

మరింత నష్టాల్లోకి సూచీలు

నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు.. కోలుకునేడట్టు కనిపించడం లేదు. బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీలు మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. 468 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్​ 57,229 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 136 పాయింట్ల నష్టంతో 17,061 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ఐటీ, బ్యాంకింగ్​ రగ షేర్లు అమ్మకాలు ఒత్తిడికి గురవుతున్నాయి. లోహ రంగ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

09:13 December 06

నష్టాల్లో మార్కెట్లు

stock market live updates: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల తరహాలోనే దేశీయ సూచీలను ఒమిక్రాన్‌ భయాలు కలవరపెడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు మళ్లీ అనిశ్చితికి చేరతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఐరోపా, ఆఫ్రికా, ఇతర దేశాల్లో కొవిడ్‌ కొత్త కేసులు పెరగడం, ప్రభుత్వాలు ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధిస్తుండటం వల్ల ఆర్థిక రికవరీకి ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దేశీయంగానూ నిన్న ఒక్కరోజే 17 ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశం 6-8 తేదీల్లో జరగనుంది. అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి వల్ల కీలక రేట్లను యథాతథంగానే ఆర్‌బీఐ కొనసాగించొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు ప్రతికూలంగా కదలాడుతున్నాయి.

bse sensex today live:

సెన్సెక్స్‌ 311 పాయింట్ల నష్టంతో 57,385 వద్ద.. నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 17,119 వద్ద ట్రేడవుతున్నాయి.

టాటా స్టీల్​, ఎల్​ అండ్​ టీ, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఇండస్​ఇండ్​, మారుతీ, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Dec 6, 2021, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details