తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్ప లాభాల్లో మార్కెట్లు- 15,200 పైకి నిఫ్టీ

stock Market LIVE
లాభాల్లో స్టాక్​మార్కెట్లు

By

Published : May 25, 2021, 9:29 AM IST

Updated : May 25, 2021, 1:38 PM IST

13:29 May 25

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 20 పాయింట్లకుపైగా పెరిగి.. 50,671 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో 15,217 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • టైటాన్​, ఏషియన్ పెయింట్స్, ఓఎన్​జీసీ, నెస్ల, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, రిలయన్స్​, ఎస్​బీఐ ప్రధానంగా నష్టాల్లో ఉన్నాయి.

10:47 May 25

స్టాక్​ మార్కెట్లు కాస్త ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. 

ఆరంభంలో 200కుపైగా లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్​.. ప్రస్తుతం 100 పాయింట్లు లాభంలో కొనసాగుతోంది. 50 వేల 760 ఎగువన ఉంది.

నిప్టీ 50 పాయింట్లు బలపడి.. 15 వేల 250 వద్ద ఉంది.

బ్యాంకింగ్​ రంగ షేర్లు నష్టాల్లో..

బ్రిటానియా, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, ఏషియన్​ పెయింట్స్​, ఓఎన్​జీసీ, టాటా స్టీల్​ లాభాల్లో ఉన్నాయి. 

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, గ్రేసిమ్​, ఎస్​బీఐ డీలాపడ్డాయి.

09:18 May 25

లాభాల్లో స్టాక్ మార్కెట్లు.

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో స్టాక్​మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 200కుపైగా పాయింట్లు పెరిగి.. 50 వేల 850 ఎగువన కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 70 పాయింట్లు బలపడింది. ప్రస్తుతం 15 వేల 270 వద్ద ఉంది.

లాభనష్టాల్లో..

బ్రిటానియా, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, నెస్లే, హిందాల్కో, టైటాన్​ కంపెనీలు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, కోల్​ ఇండియా నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

Last Updated : May 25, 2021, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details