తెలంగాణ

telangana

ETV Bharat / business

రాణించిన ఐటీ, ఫార్మా షేర్లు.. సెన్సెక్స్ 580 ప్లస్ - stock market today

stock market closing: అంతర్జాతీయ ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేశీయ సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 580 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 150 పాయింట్లు వృద్ధి చెంది 16 వేల మార్క్ పైన స్థిరపడింది.

STOCKS CLOSING
STOCKS CLOSING

By

Published : Mar 8, 2022, 3:44 PM IST

stock market closing: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, చమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల మధ్య భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. ట్రేడింగ్​లో తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. చివరకు ఫార్మా, ఐటీ షేర్లు రాణించడం వల్ల.. లాభాలతో సెషన్​ను ముగించాయి.

stock market live updates:

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 581 పాయింట్లు లాభపడింది. తొలుత 400 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్.. చివరకు కొనుగోళ్లు పుంజుకోవడం వల్ల లాభాల్లోకి మళ్లింది. 53,424 పాయింట్ల వద్ద స్థిరపడింది.

అటు, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం ఒడుదొడుకుల్లోనే పయనించింది. ప్రారంభంలో 115 పాయింట్లకు పైగా కోల్పోయింది. చివరకు 150పాయింట్లు లాభపడి 16,013 వద్ద స్థిరపడింది.

లోహపు షేర్లు మినహా మిగిలిన రంగాలన్నీ చివరకు భారీగా లాభాలు నమోదు చేశాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ రంగాలు సూచీలను లాభాల్లోకి మళ్లించాయి. బీఎస్​ఈలో మిడ్​క్యాప్, స్మాల్​క్యాప్ షేర్లు ఒక శాతం చొప్పున వృద్ధి సాధించాయి.

ఇదీ చదవండి:ఇక పెట్రో మంట మొదలు.. రోజుకు 50 పైసలు పెంపు?

ABOUT THE AUTHOR

...view details