గత సెషన్‌ను రికార్డు లాభాలు నమోదుచేసిన సూచీలు.. వారాంతపు సెషన్‌ను నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 132 పాయింట్లు తగ్గి 52,100 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 15,670 వద్దకు చేరింది.
వరుసగా ఆరో సారి రెపో, రివర్స్ రెపో రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ మదుపరుల సెంటిమెంట్ బలపడలేదు. వృద్ధి రేటు అంచనాలకు ఆర్బీఐ కోత విధించడం సైతం నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 52,389 పాయింట్ల అత్యధిక స్థాయి, 51,953 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 15,734 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 15,622 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.