గత కొద్ది రోజులుగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం భారీ లాభాలు నమోదు చేశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 568 పాయింట్లు బలపడి 49,008 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 182 పాయింట్లకు పైగా పెరిగి 14,507 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 49,235 అత్యధిక స్థాయిని; 48,700 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.