అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాలు, కరోనా భయాలతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. 2 రోజుల వరుస లాభాలకు బ్రేకులు పడ్డాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 535 పాయింట్ల నష్టంతో 31,327 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ- నిఫ్టీ 159 పాయింట్లు క్షీణించి..9,154 వద్ద ముగిసింది.
లాభాల్లో..
రిలయన్స్, బ్రిటానియా, సిప్లా, సన్‌ఫార్మా, హీరోమోటోకార్ప్ షేర్లు లాభపడ్డాయి.
నష్టాల్లో...
బజాజ్‌ఫైనాన్స్, జీల్, హిందాల్కో, ఇన్ఫ్రాటెల్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
ప్రపంచ మార్కెట్లు...
కరోనా దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ మార్కెట్లు 1.5 శాతంపైనే నష్టాలను నమోదు చేశాయి.
ఆసియా మార్కెట్లు నిక్కీ (0.9%), కొస్పీ (1.3%), హాంగ్‌సెంగ్ (0.6%), షాంఘై (1.1%) మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి పురోగతిపై సందేహాలు మదుపరుల్లో ఆందోళన పెంచాయి. చైనా చేసిన క్లినికల్ ట్రైల్లో వ్యాక్సిన్ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం మార్కెట్ల పతనానికి ఓ కారణమైంది.
రూపాయి....
డాలరుతో పోలిస్తే రూపాయి 40 పైసలు క్షీణించి రూ.76.46 వద్ద నిలిచింది.
చమురు ధర ఇలా...
బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 20.89 డాలర్లకు చేరింది.