స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్‌ను లాభాలతో ముగించాయి. సోమవారం భారీ నష్టాలను నమోదు చేసిన అనంతరం.. ఆర్థిక, లోహ, ఫార్మా రంగం షేర్లు(Stocks in news) రాణించడం కారణంగా మంగళవారం లాభాల బాట పట్టాయి. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ (Sensex today India) సెన్సెక్స్ 198 పాయింట్లు పెరిగి.. 58,664 వద్ద స్థిరపడింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ (nifty today) 198 పాయింట్ల లాభంతో 17,503 వద్ద సెషన్‌ను(Stock market news) ముగించింది.
ఇంట్రాడేలో ఇలా..
- బీఎస్ఈ సెన్సెక్స్ 58,834 పాయింట్ల గరిష్ఠాన్ని.. 57,718 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
- ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,553 పాయింట్ల అత్యధిక స్థాయిని.. 17,216 పాయింట్ల అత్యల్ప స్థాయి మధ్య కదలాడింది.
లాభనష్టాల్లో..
- పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, టెక్ మహీంద్ర షేర్లు (Stocks in news) రాణించాయి.
- ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మారుతీ షేర్లు నష్టాలను చవిచూశాయి.
ఇదీ చూడండి:అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ వివాదానికి త్వరలోనే చెక్!