తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ నష్టాల నుంచి లాభాల బాటలోకి.. - రూపాయి విలువ

చైనా వస్తువులపై మరోసారి భారీగా పన్నులు విధిస్తామని అమెరికా చేసిన హెచ్చరికతో ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లు తొలుత నష్టాలు చవిచూసినప్పటికీ చివరకు లాభాలతో ముగిశాయి. వాహన, ఐటీ, ఫైనాన్స్​ రంగాలు పుంజుకున్నాయి.

భారీ నష్టాల నుంచి లాభాల బాటలోకి..

By

Published : Aug 2, 2019, 4:55 PM IST

నష్టాలతో ప్రారంభమై చివరకు లాభాలతో ముగిశాయి దేశీయ స్టాక్​మార్కెట్లు. చైనా వస్తువులపై మరోసారి భారీ పన్నులు విధిస్తామని అమెరికా ప్రకటించినప్పటికీ వాహన, ఐటీ, ఫైనాన్స్​ స్టాకులు లాభాలు ఆర్జించడం విశేషం.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 99 పాయింట్ల వృద్ధితో 37 వేల 118 వద్ద ముగిసింది. నేషనల్​ స్టాక్​ ఎక్స్ఛేంజ్​ సూచీ నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 10 వేల 997 వద్ద స్థిరపడింది.

లాభాల్లో

భారతీ ఎయిర్​టెల్​, ఏసియన్ పెయింట్స్, బజాజ్​ ఆటో, మారుతీ సుజుకీ, ఎమ్​ అండ్ ఎమ్, టాటా మహీంద్ర, హీరో మోటోకార్ప్, టీసీఎస్​, ఎల్​ అండ్ టీ, టాటా మోటార్స్ (6.02 శాతం వరకు) లాభాలను ఆర్జించాయి.]

నష్టాల్లో

ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, టాటా స్టీల్, కోల్​ ఇండియా, ఓఎన్​జీసీ, పవర్​గ్రిడ్, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ (2.76 శాతం వరకు) నష్టపోయాయి.

వణికిపోయిన ప్రపంచ మార్కెట్లు

చైనా వస్తువులపై 10 శాతం అధిక పన్నులు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటన ప్రపంచ మార్కెట్లను గడగడలాడించింది. ఫలితంగా ఆసియా మార్కెట్లు షాంఘై కాంపోజిట్ ఇండెక్స్, హాంగ్​సాంగ్, కోస్పి, నిక్కీ తీవ్రంగా నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

విదేశీ పెట్టుబడిదారులు ఇవాళ కూడా రూ.1,056.55 కోట్లు విలువైన షేర్లను ఉపసంహరించుకున్నారు.

రూపాయి విలువ

రూపాయి విలువ 52 పైసలు తగ్గి, డాలరుకు రూ.69.58గా ఉంది.

ముడిచమురు ధర

అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 2.28 శాతం పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 61.88 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: సిరి: 'ఇతర ఆదాయాల'కూ లెక్క చూపాలి

ABOUT THE AUTHOR

...view details