తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ, బ్యాంకింగ్ షేర్ల జోరుతో లాభాలు - nifty

దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బాంబే స్టాక్​ ఎక్స్​ఛేంజ్​(బీఎస్​ఈ) 350 పాయింట్లు పైకెగిసి 39,887.97 వద్ద ట్రేడవుతోంది. 76.25 పాయింట్లు మెరుగైన నిఫ్టీ 11,946 వద్ద కొనసాగుతోంది.

స్టాక్​ మార్కెట్లు

By

Published : Jun 10, 2019, 10:21 AM IST

దేశీయ స్టాక్​ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 350 పాయింట్లు బలపడి 39,887.97 వద్ద కొనసాగుతోంది. 76.25 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 11,946.90 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలతో ఐటీ, బ్యాంకింగ్​ రంగాలు పరుగులు పెడుతున్నాయి.

డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.23 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లోనివి

టాటా స్టీల్​, జీ ఎంటర్​టైన్​, ఇండియా బుల్స్ హౌసింగ్, ఎస్​బీఐ, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, ఇండియా సిమెంట్స్​ లాభాల్లో సాగుతున్నాయి.

నష్టాల్లోనివి

రిలయన్స్​ క్యాపిటల్, రిలయన్స్​ ఇన్​ఫ్రా, పీసీ జువెలర్స్​, జె అండ్ కె బ్యాంక్​ నష్టాల బాట పట్టాయి.

ఇదీ చూడండి: 'పన్నులు తగ్గించాలి.. ప్రోత్సాహకాలు అందించాలి'

ABOUT THE AUTHOR

...view details