తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెరికా- చైనా చర్చలపై సానుకూలత.. రికార్డు స్థాయికి సెన్సెక్స్​

అమెరికా- చైనా వాణిజ్య చర్చలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలో 175 పాయింట్ల లాభంతో సెన్సెక్​ 41,185 గరిష్ఠ స్థాయిని తాకింది. నిఫ్టీ 12 వేల మార్కును దాటింది.

Sensex
అమెరికా-చైనా చర్చలపై సానుకూలత.. రికార్డు స్థాయికి సెన్సెక్స్​

By

Published : Dec 16, 2019, 10:19 AM IST

అమెరికా- చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి, అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ మార్కెట్లు నేడు ప్రారంభ సెషన్​లో రికార్డు స్థాయిని తాకాయి. 175 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్​ 41,185 గరిష్ఠ స్థాయికి చేరింది. 48 పాయింట్ల వృద్ధితో నిఫ్టీ 12 వేల మార్కును దాటింది.

అనంతరం కొద్ది సమయం తర్వతా తిరోగమనం దిశగా సాగాయి సూచీలు.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-సెన్సెక్స్​ 15 పాయింట్ల లాభంతో 41,025 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ-నిఫ్టీ 6 పాయింట్లు వృద్ధితో 12,092 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

కొటక్​ మహీంద్ర సుమారు 2 శాతం మేర లభాల్లో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్​సీఎల్​ టెక్​, టెక్​ మహీంద్ర, టీసీఎస్​, బజాజ్​ ఆటో, ఎస్​బీఐ లాభాల్లో ట్రేడవుతున్నాయి. అయితే.. సన్​ ఫార్మా సుమారు 1.57 శాతం మేర నష్టపోయింది. ఎస్​ బ్యాంక్​, హెచ్​యూఎల్​, ఐటీసీ, బజాజ్​ ఫినాన్స్​, యాక్సిస్​ బ్యాంక్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 8 పైసలు బలపడి రూ. 70.75 వద్దకు చేరింది.

ఇదీ చూడండి: 'నగదు రహితం'లో అమెరికా, చైనా పోటాపోటీ!

ABOUT THE AUTHOR

...view details