తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాపై 'కొత్త' భయం- సెన్సెక్స్ 1406 పాయింట్లు డౌన్ - నిఫ్టీ తాజా వార్తలు

బ్రిటన్​లో కరోనా వైరస్​ కొత్త స్ట్రెయిన్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. దాంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. సెన్సెక్స్​ 1406 పాయింటు, నిఫ్టీ 432 పాయింట్ల మేర నష్టపోయాయి.

stock markets
కుప్పకూలిన మార్కెట్లు

By

Published : Dec 21, 2020, 3:44 PM IST

కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి​పై ఆందోళనలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. బ్రిటన్​లో ఆంక్షలు, ఐరోపా మార్కెట్లు నష్టాలతో ప్రారంభమవటం వల్ల దేశీయ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్​ ఒకదశలో ఏకంగా 1,500 పాయింట్లకుపైగా నష్టపోయింది. చివరకు 1406 పాయింట్ల నష్టంతో 45,553 వద్ద స్థిరపడింది. బీఎస్​ఈ-30లోని దాదాపు అన్ని షేర్లూ నష్టాల్లోనే ముగిశాయి.

  • బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్​.. 1406 పాయింట్ల నష్టంతో 45,553 పాయింట్ల వద్ద స్థిరపడింది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ.. 432 పాయింట్ల క్షీణతతో 13,328 పాయింట్ల వద్ద ముగిసింది.

భారీగా నష్టపోయిన ప్రధాన రంగాలు..

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజీలో దాదాపు అన్ని షేర్లూ నష్టాల్లోకి వెళ్లాయి. నిఫ్టీ పీఎస్​యూ బ్యాంకు ​ 4 శాతం, ప్రైవేటు బ్యాంకులు 2.2 శాతం, మెటల్​ 3.8, ఆటో రంగం 2.8 శాతం మేర నష్టల్లోకి కూరుకుపోయాయి.

బ్రిటన్​ సరిహద్దులు మూసివేస్తున్న వార్తలతో విమానయాన రంగం భారీగా నష్టపోయింది. స్పైస్​జెట్​ షేర్లు 9.5 శాతం, ఇంటర్​గ్లోబ్​ ఏవియేషన్​ 6.4 శాతం మేర క్షీణించాయి. కొత్త వైరస్​ భయంతో అంతర్జాతీయంగా చమురు ధరలు 3 శాతం మేర నష్టపోవటం వల్ల ఇంధన రంగమూ కుదేలైంది. ఓఎన్​జీసీ 8.4, గేయిల్​ 7.6, ఇండియన్​ ఆయిల్​ 6.8 శాతం, భారత్​ పెట్రోలియం 5.3 శాతం మేరకు నష్టాల్లో ముగిశాయి.

ఇదీ చూడండి: పన్ను ఎగవేతకు అడ్డుకట్ట ఎలా?

ABOUT THE AUTHOR

...view details