తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ 364 ప్లస్​ - షేర్ మార్కెట్ అప్​డేట్స్

stocks live updates
స్టాక్ మార్కెట్లు లైవ్​

By

Published : Aug 2, 2021, 9:23 AM IST

Updated : Aug 2, 2021, 3:45 PM IST

15:43 August 02

స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 52,951 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 122 పాయింట్ల లాభంతో 15,885 వద్దకు చేరింది.

  • టైటాన్, ఎం&ఎం, యాక్సిస్​ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • టాటా స్టీల్, బజాజ్ ఫిన్​సర్వ్​, బజాజ్ ఫినాన్స్, సన్​ఫార్మా, డాక్టర్​ రెడ్డీస్ నష్టపోయాయి.

12:16 August 02

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 360 పాయింట్లకుపైగా లాభంతో 52,947 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లకుపైగా వృద్ధితో 15,878 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మెటల్​ షేర్లు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • టైటాన్​, యాక్సిస్​ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్​, ఇండస్​ఇండ్ బ్యాంక్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • టాటా స్టీల్, పవర్​గ్రిడ్​, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్​సర్వ్​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:11 August 02

STOCKS LIVE

స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 320 పాయింట్లకుపైగా పెరిగి.. 52,913 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 100 పాయింట్లకుపైగా లాభంతో.. 15,864 వద్ద కొనసాగుతోంది.

జులైలో జీఎస్​టీ వసూళ్లు పెరగటం, వాహన అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించడం వంటి సానుకూలతలు లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • టైటాన్​, మారుతీ, యాక్సిస్​, సన్​ఫార్మా, బజాజ్ ఆటో షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • 30షేర్ల ఇండెక్స్​లో ఎన్​టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్​, పవర్​గ్రిడ్​ మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Aug 2, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details