తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు - షేర్ మార్కెట్ వార్తలు

స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్​ను స్వల్ప లాభాలతో ముగించాయి(stock market live). సెన్సెక్స్​ (bse sensex today) 32 పాయింట్లు బలపడి 60,719 వద్దకు చేరుకుంది. నిఫ్టీ (nse nifty 50 index ) 7 పాయింట్లు వృద్ధి చెందింది.

stock market
స్టాక్ మార్కెట్​

By

Published : Nov 15, 2021, 3:40 PM IST

Updated : Nov 15, 2021, 4:01 PM IST

స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి (stock market news). బీఎస్​ఈ-సెన్సెక్స్ (bse sensex today live ) 32 పాయింట్లు పెరిగి 60,719 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ- నిఫ్టీ (nifty today live ) 7 పాయింట్లు కోల్పోయి 18,109 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సూచీలు మొదట లాభాలతో ప్రారంభమయ్యాయి. తరువాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మిడ్​ సెషన్​లో తిరిగి పుంజుకున్న మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగాయి.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 61,036 పాయింట్ల అత్యధిక స్థాయి, 60,597 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 18,210 పాయింట్ల గరిష్ఠ స్థాయి 18,071 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

పవర్​ గ్రిడ్​, ఐటీసీ, నెస్లే, ఏషియన్​ పెయింట్స్​, కోటక్​ మహీంద్ర, టీసీఎస్​ షేర్లు లాభాలను గడించాయి.

టాటా స్టీల్​, ఎస్​బీఐ, బజాజ్​ ఆటో, మహీంద్ర అండ్​ మహీంద్ర, బజాజ్​ ఫిన్​సర్వ్​ షేర్లు నష్టాలు చవిచూశాయి.

Last Updated : Nov 15, 2021, 4:01 PM IST

ABOUT THE AUTHOR

...view details