కరోనా వైరస్ ప్రభావానికి తోడు అంతర్జాతీయ ప్రతికూలతలు, భారీగా విదేశీనిధుల తరలింపుతో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
21 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 41వేల 301 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 12వేల 120 వద్ద ట్రేడవుతోంది ఎన్ఎస్ఈ నిఫ్టీ.
లాభనష్టాల్లోనివి...
ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, టీసీఎస్, సన్‌ఫార్మా, మారుతీ, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హీరోమోటోకార్ప్, టాటాస్టీల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.