స్టాక్ మార్కెట్లు (Stocks Today) సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ (Sensex today) 127 పాయింట్లు తగ్గి 58,177వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ (Nifty today) 14 పాయింట్ల అతి స్వల్ప నష్టంతో 17,355 వద్దకు చేరింది.
'సూచీలు ఇప్పటికే గరిష్ఠ స్థాయిల వద్ద ఉన్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత పాటిస్తున్నారు. దీనికి తోడు రిలయన్స్ వంటి హెవీ వెయిట్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోవడం వంటి పరిణామాలు నష్టాలకు కారణంగా తెలుస్తోంది' అని నిపుణులు అంటున్నారు. జియోఫోన్ నెక్ట్స్ విడుదలను వాయిదా వేయడం వల్ల రిలయన్స్ షేర్లలపై ప్రతికూల ప్రభావం పడింది.
ఇంట్రాడే సాగిందిలా (Intraday)..
సెన్సెక్స్ 58,314 పాయింట్ల అత్యధిక స్థాయి, 57,944 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 17,378 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,269 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.