తెలంగాణ

telangana

ETV Bharat / business

2020ని ఫ్లాట్​గా ముగించిన సూచీలు

దేశీయ మార్కెట్లు ఆద్యంతం ఒడుదొడుకులకు లోనై చివరకు 2020 ఏడాదిని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 5 పాయింట్లు లాభపడింది. అలాగే.. 14వేల మార్క్​ను దాటిన నిఫ్టీ చివరకు 0.2 శాతం నష్టంతో ముగిసింది.

stocks
స్టాక్​ మార్కెట్లు

By

Published : Dec 31, 2020, 3:53 PM IST

2020 ఏడాదిని ఫ్లాట్​గా ముగించాయి దేశీయ సూచీలు. సెన్సెక్స్​ 5 పాయింట్ల స్వల్ప లాభపడగా.. నిఫ్టీ 0.2 శాతం నష్టంతో ముగిసింది. ఒకానొకదశలో భారీ లాభాలతో జీవితకాల గరిష్ఠ స్థాయి 14,000వేల ఎగువకు చేరిన నిఫ్టీ.. చివరకు 13,982 పాయింట్ల వద్ద స్థిరపడింది. కరోనా లాక్​డౌన్​తో మార్చిలో 8వేల దిగువకు చేరిన నిఫ్టీ.. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని 86 శాతం మేర లాభపడింది.

మరోవైపు బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ కూడా 47,866 పాయింట్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగి చివరకు 2020 ఏడాదిని స్వల్ప లాభంతో ముగించింది. 5 పాయింట్లు లాభపడి 47,751 వద్ద స్థిరపడింది.

విదేశీ పెట్టుబడుల ప్రవాహం, ప్రభుత్వం, ఆర్బీఐ నుంచి మద్దతు లభించటం సహా వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో మార్కెట్లు భారీగా లాభపడ్డాయి.

లాభనష్టాల్లోనివి..

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్​, ఏషియన్​పెయింట్స్​, సెయిల్​, భారత్​ ఎలక్ట్రానిక్స్​, వొడాఫోన్​ ఐడియా, జుబిలంట్​ ఫుడ్స్​, నాల్కో భారీగా లాభపడ్డాయి.

మరోవైపు.. నెస్లే ఇండియా, ఓఎన్​జీసీ, బజాజ్​ ఆటో, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, జీఎంఆర్​ ఇన్​ఫ్రా, శ్రీ సిమెంట్స్​, రామ్కో సిమెంట్స్​, ఏసీసీ, ఎంఆర్​ఎఫ్​ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details