తెలంగాణ

telangana

ETV Bharat / business

స్టాక్ మార్కెట్ల జోరు- సెన్సెక్స్ 195 ప్లస్ - నిఫ్టీ లాభాలు

స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు చూపించింది. సెన్సెక్స్ 195 పాయింట్లు ఎగబాకి.. 44 వేల ఎగువన ముగిసింది. 67 పాయింట్లు వృద్ధి చెందిన నిఫ్టీ.. 12,926 పాయింట్ల వద్ద స్థిరపడింది.

STOCKS CLOSE
స్టాక్ మార్కెట్ల జోరు... సెన్సెక్స్ 200 ప్లస్

By

Published : Nov 23, 2020, 3:50 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఒడుదొడుకులతో ప్రారంభమైన మార్కెట్లు.. ఐటీ, ఫార్మా షేర్ల దూకుడుతో సూచీలు పైకి ఎగబాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడింది. 44,077 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది.

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాల్లోనే పయనించింది. 67 పాయింట్లు వృద్ధి చెంది.. 12,926 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివివే

సెన్సెక్స్ షేర్లలో ఓఎన్​జీసీ రికార్డు స్థాయిలో 6 శాతానికిపైగా ఎగబాకింది. ఇండస్​ఇండ్, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్​సర్వ్, టీసీఎస్ షేర్లు లాభాల్లో పయనించాయి.

మరోవైపు హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్​బీఐ షేర్లు నష్టపోయాయి.

ABOUT THE AUTHOR

...view details