Share Market News Today: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మంగళవారం సెషన్‌ను తొలుత స్వల్ప లాభాలతో ప్రారంభించిన సూచీలు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అనంతరం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. ఏ క్రమంలో కూడా మార్కెట్లు పుంజుకోలేకపోయాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ-సెన్సెక్స్ 554 పాయింట్లు కోల్పోయి 60,754 వద్ద సెషన్‌ను ముగించింది. మరో సూచీ నిఫ్టీ 195 పాయింట్లు క్షీణించి 18,113 వద్ద స్థిరపడింది.
ఐటీ, మెటల్, ఫార్మా రంగాల్లో అమ్మకాల జోరు కొనసాగడం వల్ల షేర్లు భారీగా నష్టపోయాయి. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింత పెరగడం కారణంగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 61,475 పాయింట్ల అత్యధిక స్థాయి, 60,662 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.