తెలంగాణ

telangana

ETV Bharat / business

చమురు ధరలకు రెక్కలు.. మార్కెట్లకు నష్టాలు - స్టాక్​ మార్కెట్లు​

కేంద్ర ప్రభుత్వం వరుస ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్టాక్​మార్కెట్లను నష్టాలు వీడట్లేదు. సెన్సెక్స్​ 261.68 పాయింట్ల నష్టంతో 37,123.31 వద్ద ముగిసింది. నిఫ్టీ 79.80 పాయింట్ల నష్టంతో 10,996.10 వద్ద స్థిరపడింది.

ప్రతికూల పవనాలతో నష్టాల్లో ముగిసిన స్టాక్​ మార్కెట్లు​

By

Published : Sep 16, 2019, 4:11 PM IST

Updated : Sep 30, 2019, 8:18 PM IST

సౌదీ అరాంకో చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడుల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయన్న ఆందోళనల మధ్య మదుపర్లు పెద్దఎత్తున అమ్మకాలకు దిగడమే ఇందుకు ప్రధాన కారణం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 261.68 పాయింట్లు పతనమై.. 37,123.31 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 79.80 పాయింట్లు నష్టపోయి 10,996 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివివే...

టైటాన్​ కంపెనీ, బ్రిటానియా, ఓఎన్​జీసీ, టెక్​ మహింద్రా, నెస్లే లాభాలు ఆర్జించాయి.

బీపీసీఎల్​, ఎం&ఎం, యూపీఎల్​, ఎస్బీఐ, ఎస్​ బ్యాంకు నష్టాల్లో ముగిశాయి.

రూపాయి..

రూపాయి 60 పైసలు లాభపడి.. డాలర్​తో పోలిస్తే మారకం విలువ రూ.71.51 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Sep 30, 2019, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details