తెలంగాణ

telangana

ETV Bharat / business

సానుకూల పవనాలతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు - స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా పరిస్థితులు కుదుటపడటం వల్ల దేశీయ స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలను కొనసాగించాయి. క్రితం సెషన్​లో భారీగా వృద్ధి చెందిన సూచీలు నేడు స్వల్ప లాభాలు నమోదు చేశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 147 పాయింట్లు లాభపడి 41,599 పాయింట్ల వద్ద స్థిరపడింది. 41 పాయింట్లు వృద్ధి చెందిన నిఫ్టీ 12,256 పాయింట్ల వద్ద ముగిసింది.

stock markets closing
స్టాక్​ మార్కెట్లు

By

Published : Jan 10, 2020, 3:50 PM IST

Updated : Jan 10, 2020, 4:18 PM IST

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టటం.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి బడ్జెట్​లో ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్న అంచనాలు మార్కెట్​ సెంటిమెంట్​ను నడిపించాయి. దీంతో దీర్ఘకాల ఈక్విటీల కొనుగోలుకు మదుపరులు మొగ్గుచూపారు. నిన్నటి సెషన్​లో భారీగా లాభపడ్డ సూచీలు ఈ రోజు స్వల్ప వృద్ధి నమోదు చేశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్-​ 147 పాయింట్లు లాభపడి 41,599 వద్ద ముగిసింది. ఓ దశలో 323 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ.. అనంతరం స్వల్ప లాభాలకు పరిమితమైంది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాలను గడించింది. నేటి ట్రేడింగ్​లో 41 పాయింట్లు లాభపడి 12,256 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోని

ఇన్ఫోసిస్ 1.47 శాతం మేర లాభపడింది. అల్ట్రాటెక్ సిమెంట్, మారుతీ, కొటక్ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్, హెచ్​యూఎల్ లాభాలు గడించాయి.

మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, టైటాన్, భారతీ ఎయిర్​టెల్​లు నష్టాలు మూటగట్టుకున్నాయి.

రూపాయి మారకం

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలర్​తో పోలిస్తే 18పైసలు బలపడి రూ.71.03 వద్ద స్థిరపడింది.

ముడి చమురు

ముడి చమురు ధర 0.31 శాతం మేర పతనమైంది. బ్యారెల్ ముడి చమురు 65.17 అమెరికన్ డాలర్లుగా ఉంది.

ఇతర మార్కెట్లు

ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, టోక్యో, సియోల్​లు లాభపడ్డాయి. షాంఘై స్టాక్​ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి.

Last Updated : Jan 10, 2020, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details